Breaking News

గుంపు మేస్త్రీకి 1.37 లక్షల శాలరీ ఆఫర్‌!

Published on Wed, 02/21/2024 - 12:48

దారిద్ర్యంలో మగ్గిపోతున్న వ్యక్తికి ఒక్కసారిగా లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగం లభిస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి ఊహకందని ఆఫర్‌ బీహార్‌ గుంపు మేస్త్రీకి దక్కింది. దీంతో అతని జీవితం ఒక్కసారిగా మారిపోయింది. 

ఇజ్రాయెల్‌లో గత కొన్ని నెలలుగా హమాస్‌తో జరుగుతున్న యుద్ధం కారణంగా పలు భవనాలు శిధిలమయ్యాయి. తిరిగి భవనాలను నిర్మించేందుకు ఇజ్రాయెల్‌కు నిర్మాణ కార్మికుల అవసరం ఎంతో ఉంది. దీనిలో భాగంగానే కార్మికుల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ముఖ్యంగా భవన నిర్మాణపు పనుల్లో పాల్గొనే కార్మికులకు డిమాండ్ అధికంగా ఉంది. 

అర్హతను అనుసరించి గుంపు మేస్త్రీలను రూ. 1.37 లక్షల వేతనంతో  నియమించుకుంటున్నారు. ఇలా నియమితులైనవారు ఏడాది నుంచి ఐదు సంవత్సరాల పాటు అక్కడ పనులు చేయాల్సి ఉంటుంది.  బీహార్‌లోని చాప్రా నివాసి జితేంద్ర కుమార్ రాయ్ అనే తాపీ మేస్త్రీకి ఇజ్రాయెల్‌లో పనిచేసే అవకాశం దొరికింది.

పొలిటికల్ సైన్స్‌లో గ్రాడ్యుయేట్ అయిన జితేంద్ర చిన్నప్పటి నుంచి సైనికునిగా మారాలని కలలుగనేవాడు. అతనికి తగిన పని దొరక్కపోవడంతో తాపీ మేస్త్రీగా జీవనం సాగిస్తున్నాడు. గుంపు మేస్త్రీగా ధృవీకరణ పత్రం పొందేందుకు జంషెడ్‌పూర్‌లోని నేషనల్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో ఎనిమిది సంవత్సరాలు పనిచేశాడు.

ప్రస్తుతం జితేంద్ర బీహార్‌లో తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ప్రతీనెలా రూ.20 వేల వరకూ సంపాదిస్తుంటాడు. ఇజ్రాయెల్ వెళ్లే అవకాశం రాగానే జితేంద్ర ఎగిరిగంతేశాడు. తమ కుటుంబం ఇన్నాళ్లూ అనుభవించిన పేదరికం ఇక పటాపంచలైపోతుందని జితేంద్ర ఆశాభావం వ్యక్తం చేశాడు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)