Breaking News

అతడొక దుర్మార్గుడు: ముసుగు మనిషి భార్య

Published on Fri, 08/22/2025 - 09:41

కర్ణాటక : డబ్బుల కోసం ఆశపడి ఎవరో అన్నమాటలను పట్టుకొని పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మస్థల పేరుకు మాయని మచ్చ తెచ్చేలా తన మాజీ భర్త ప్రవర్తించాడని ఫిర్యాదిదారు, ముసుగుమనిషి ఒకప్పటి భార్య ఆరోపించింది. అతనితో విడాకులు తీసుకున్న మండ్య జిల్లా నాగమంగళకు చెందిన మహిళ తన మాజీ భర్త గురించి మీడియాతో మాట్లాడారు. అతనిది కూడా మండ్య జిల్లానే. 25 ఏళ్ల కిందట మేం పెళ్ళి చేసుకున్నాం, అతడు నేత్రావతి స్నానాల ఘాట్లను శుభ్రం చేసే పనిలో ఉండేవాడు. 7 సంవత్సరాలపాటు కలిసి ఉన్నాం, మాకు ఒక మగ, ఒక ఆడ పిల్ల ఉన్నారు, కుమార్తెకు పెళ్లయింది. నా మాజీ భర్త నా మీద నిత్యం అనుమానంతో గొడవపడేవాడు, అతని బాధలు పడలేక విడాకులు తీసుకున్నా. అతడు ధర్మస్థల గురించి చెప్పేవన్నీ అబద్ధాలే అని మండిపడింది.  

ఆ మాటలే వినలేదు 
ధర్మస్థలలో అత్యాచారాలు జరిగేవని, నది పక్కన శవాలు పాతిపెట్టారని, నగలు దోచుకునేవారని నేను ఎప్పుడూ వినలేదు. నాతో భర్త ఎప్పుడూ అలా చెప్పలేదు. జరిగే ప్రచారమంతా అబద్ధం అని ఆమె పేర్కొంది. ఆ పుణ్యక్షేత్రం మీద ఏదో  చేయడానికి కుట్రతో ఇలా ప్రచారం చేస్తున్నారని తెలిపింది. తాము విడిపోయిన తరువాత అతడు మరొకరిని పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. భరణం కోసం కోర్టుకు వెళ్తే, నాకు జీతమే రాదు, భోజనం మాత్రమే పెడతారు, ఏమీ ఇవ్వలేను అని కోర్టులో చెప్పాడన్నారు. పుట్టింటిలో తల్లి, పిల్లలతో కలిసి ఉంటున్నట్లు తెలిపింది. 

#

Tags : 1

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)