Breaking News

అది ఉత్తుత్తి పెళ్లి...

Published on Wed, 07/29/2026 - 04:57

అమ్రోహా: ఒకే వ్యక్తిని ముగ్గురు పెళ్లాడిన వీడియో ఒకటి ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, దీనిపై ఆన్‌లైన్‌లో పెద్ద దుమారమే చెలరేగింది. స్పందించిన యూపీ మహిళా సంక్షేమ కమిటీ(సీడబ్ల్యూసీ) అధికారులు ఆ ముగ్గురినీ సోమవారం పిలిపించారు. విచారణలో వారు చెప్పిన విషయాలను విని అధికారులు నోరెళ్లబెట్టారు. అదంతా వైరలయ్యేందుకు తీసుకున్న వీడియో మాత్రమేనని వారు అసలు విషయం వెల్లడించారు. సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయ్యేందుకు తీసిన ప్రాంక్‌ మాత్రమేనని చెప్పుకొచ్చారు. అయితే, తమపై ఆన్‌లైన్‌ ట్రోలింగ్‌ ఘోరంగా ఉందని వాపోయారు. అది నిజంగా పెళ్లేనంటూ అబద్ధం చెప్పినందుకు పశ్చాత్తాప పడుతున్నారు. ఇకనైనా వేధింపులను ఆపాలని వారు వేడుకున్నారు.

ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు వీడియోలో కనిపించిన ముగ్గురిలో ఒకరు మైనర్‌ అంటూ తమకు మూడు రోజుల క్రితం అందిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు సీడబ్ల్యూసీ చైర్మన్‌ అతులేశ్‌ కుమార్‌ భరద్వాజ్‌ వివరించారు. ముగ్గురి నుంచి వాంగ్మూలాలను సేకరించామని, వీరిలో ఒకరు మైనర్‌ అని రూఢీ అయ్యిందని చెప్పారు. విచారణ అనంతరం తగు చర్యలు తీసుకుంటామన్నారు. యూపీలోని అమ్రోహా జిల్లా ధోరియా గ్రామానికి చెందిన దేవిక, ఛావి అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు, వారి బంధువు మెహర్‌పూర్‌కు చెందిన ఆల్కా కలిసి శ్యాంపురి గ్రామానికి చెందిన వికాస్‌ అలియాస్‌ విక్కును హసన్‌పూర్‌లోని చాముండ ఆలయంలో వివాహమాడినట్లు ఆన్‌లైన్‌లో వీడియో ప్రత్యక్షమైంది.

వీరు నలుగురూ సోషల్‌ మీడియా కంటెంట్‌ క్రియేటర్లు, ఆన్‌లైన్‌లో బాగా ఫాలోయింగ్‌ ఉన్న వాళ్లు. ఆరు నెలలుగా వికాస్‌ ముగ్గురికీ భర్తగా సోషల్‌ మీడియాలో రీల్స్‌ చేస్తున్నాడు. అయితే, ముగ్గురు యువతులు ఒక్కరినే వివాహమాడటం సనాతన ధర్మానికి విరుద్ధమంటూ హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే, తాము మైనర్లమనీ, ఇష్టం వచ్చిన వారిని పెళ్లాడే హక్కు తమకుందని, పురాణాల్లోనూ ఇలాంటి ఉదాహరణలున్నాయంటూ వారు మొదట్లో కొట్టిపారేశారు.

అదేవిధంగా, ముగ్గురు యువతులు, ఒక యువకుడి పెళ్లి తాను జరిపించలేదని చాముండ ఆలయ పూజారి స్పష్టం చేస్తున్నారు. వివాదాస్పద వీడియోలో ఉన్న ఆ నలుగురినీ ఈ నెల 23వ తేదీన పిలిపించి, వారి వయస్సును నిర్ధారించే పత్రాలను సమరి్పంచాలని, లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని కోరామని హసన్‌పూర్‌ సీనియర్‌ ఎస్సై అమిత్‌ కుమార్‌ తెలిపారు. అయితే, వారింకా వాటిని ఇవ్వలేదన్నారు.

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)