Breaking News

మావోయిస్టుల దుశ్చర్య.. ఇన్‌ఫార్మర్‌ నెపంతో దారుణ హత్య

Published on Sun, 02/02/2025 - 13:55

ముంబై: మహారాష్ట్రలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసుల ఇన్‌ఫార్మర్ నెపంతో పౌరుడు సుఖ్‌రామ్ మాడవిని దారుణంగా హత్య చేశారు. అనంతరం, ఆయన మృతదేహం వద్ద మావోయిస్టులు లేఖను విడిచిపెట్టి వెళ్లారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

వివరాల ప్రకారం.. గడ్చిరోలిలో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. భమ్రాగడ్ తహసీల్‌లో ఉన్న కియర్ గ్రామంలో సామన్య పౌరుడు సుఖ్‌రామ్‌ మాడవిని హత్య చేశారు. అనంతరం, అతడి మృతదేహం వద్ద లేఖను విడిచిపెట్టి వెళ్లారు. ఈ లేఖలో మాడవిని పోలీసుల ఇన్‌ఫార్మర్‌ని అని తెలిపారు. పెంగుండ ప్రాంతంలో పోలీసు క్యాంప్ ఏర్పాటుకు అతడు సహకరించాడని పేర్కొన్నారు. మావోయిస్టుల కదలికలపై పోలీసులకు సమాచారం అందించినట్టు తెలిపారు.

ఇదిలా ఉండగా.. మావోయిస్టుల చర్యపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ పౌరుడైన సుఖ్‌రామ్‌ మాడవిని ఇన్‌ఫార్మర్‌ నెపంతో హత్య చేయడం దారుణమన్నారు. కాగా, ఈ ఏడాదిలో మావోయిస్టులు ఓ వ్యక్తిని హత్య చేయడం ఇదే మొదటిసారని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్త చేపట్టినట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు.. ఇటీవలి కాలంలో ఎన్‌కౌంటర్ల కారణంగా భారీ సంఖ్యలో మావోయిస్టులు చనిపోయిన విషయం తెలిసిందే. దాదాపు 40 మందికి పైగా మావోయిస్టులు మృత్యువాతపడ్డారు. 

 

Videos

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!

మీ పాదయాత్రలో పాల్గొంటే DSC ఉద్యోగాలు పంచేస్తారా?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు