Breaking News

ఆటగాళ్లను ప్రోత్సహించాలి: ప్రధాని మోదీ

Published on Sun, 07/28/2024 - 12:41

‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం) తన మసులోని మాటను దేశ ప్రజల ముందు ఉంచారు. ప్రస్తుతం జరుగుతున్న ప్యారిస్ ఒలంపిక్స్ ప్ర‌పంచ‌ దృష్టిని ఆకర్షిస్తున్నాయని అన్నారు. ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు, దేశానికి ఘనత సాధించిపెట్టేందుకు ఒలింపిక్స్ మన ఆటగాళ్లకు మంచి అవకాశం కల్పిస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

దేశ ప్రజలంతా ఒలింపిక్‌ ఆటగాళ్లను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్‌ విద్యార్థులతో ముచ్చటించారు. కొద్ది రోజుల క్రితం ప్రపంచ మ్యాథ్స్ ఒలింపిక్స్ నిర్వహించామని, వీటిలో భారత విద్యార్థులు అద్భుత ప్రదర్శన చూపారన్నారు. ఇందులో మన జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, నాలుగు బంగారు పతకాలు, ఒక రజత పతకాన్ని సాధించిందని పేర్కొన్నారు.

అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్‌లో 100కు పైగా దేశాలకు చెందిన యువతీయువకులు పాల్గొన్నారని, ఓవరాల్‌గా మొదటి ఐదు స్థానాల్లో మన బృందం చోటు దక్కించుకుందని ప్రధాని పేర్కొన్నారు. దేశానికి కీర్తిని తీసుకువచ్చిన విద్యార్థులతో ప్రధాని మాట్లాడారు. పూణేకు చెందిన ఆదిత్య వెంకట్ గణేష్, సిద్ధార్థ్ చోప్రా, ఢిల్లీకి చెందిన అర్జున్ గుప్తా, గ్రేటర్ నోయిడాకు చెందిన కనవ్ తల్వార్, ముంబైకి చెందిన రుషిల్ మాథుర్, గౌహతికి చెందిన ఆనందో భాదురితో ప్రధాని మాట్లాడారు.

మన తల్లి కోసం, మాతృభూమి కోసం మనం ప్రత్యేకంగా ఏదైనా చేయాలని ప్రధాని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మొక్కలు నాటే ప్రచారంలో మనమంతా భాగస్వాములు కావాలన్నారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ‘ఏక్ పేడ్‌ మా కే నామ్’ కార్యక్రమం కింద ఒకే రోజు రెండు లక్షల మొక్కలను నాటి, సరికొత్త  సృష్టించామని మోదీ చెప్పారు. దేశ ప్రజలు ఖాదీ దుస్తులను కొనుగోలు చేయాలని ప్రధాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంకా ఎవరైనా ఖాదీ దుస్తులు  కొనకుంటే  ఇప్పుడే కొనుగోలు చేయాలని కోరారు. ఆగస్ట్ నెల వచ్చేస్తోందని, ఇది స్వాతంత్ర్య మాసమని, ఇది విప్లవానికి గుర్తు అని, ఖాదీని కొనడానికి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు