Breaking News

ఇన్ని నెలలు జైల్లో ఉంటానని ఊహించలేదు: మనీష్‌ సిసోడియా

Published on Wed, 08/14/2024 - 14:14

న్యూఢిల్లీ:  ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో అరెస్టైన ఆప్‌ సీనియర్‌ నేత మనీష్‌ సిసోడియా ఇటీవల తిహార్‌ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. గతేడాది ఫిబ్రవరిలో అరెస్ట్‌ అయిన సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో దాదాపు 17 నెలల అనంతరం ఆగష్టు 9న జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.. ఇంత కాలం తాను జైలులో ఉంటానని ఎప్పుడూ అనుకోలేదని తెలిపారు.  

విచారణను పొడిగించాలనే ఉద్ధేశ్యంతోనే తనపై ఆరోపణలు చేశారని అన్నారు. కొన్ని నెలల ముందు కూడా తాను జైలుకు వెళ్తానని ఊహించలేదని తెలిపారు. ‘రాజకీయాల్లో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం మామూలే. కాబట్టి నాకు లోపల నుంచి నమ్మకం ఉండేది. ఒక వ్యక్తిని జైలుకు పంపడం లేదా  అరెస్టు చేయడం వెనుక ఏదో ఒక కారణం ఉంటుందని భావించాను.

సంస్కరణలు తీసుకురావాలి, అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలి, ప్రజలతో మమేకం అవ్వాలని క్రియాశీల రాజకీయాల్లోకి ఎవరైనా రావాలి అనుకున్నప్పుడు వారికి రెడ్‌ కార్పెడ్‌ పరిచి స్వాగతం లభిస్తుందని ఎప్పుడూ ఆశించకూడదు.  అదే విధంగా నేను కూడా మానసికంగా సిద్ధమయ్యాను. కానీ మరీ 17 నెలల పాటు మద్యం పాలసీ కేసులో జైలులో నేను ఎప్పుడూ అనుకోలేదు

ఆరోపణలు కల్పితమే..
పీఎంఎల్ చట్టం కింద ఈడీ, సీబీఐ నామీద కేసులు పెట్టింది. ఈ చట్టం ప్రధానంగా ఉగ్రవాదులు, డ్రగ్స్ మాఫియాలకు నిధులను ఆపడానికి ఉద్దేశించిందిది. ఈ చట్టం ప్రకారం బెయిల్ సాధించడం కష్టం. అందుకే నన్ను చాలా కాలం జైలులో ఉంచడమే వారి ఏకైక లక్ష్యం. ముఖ్యంగా నా భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడు నేను జైలులో ఉండటం నాకు, నా కుంటుబానికి ఇబ్బందిగా ఉండేది. . అయితే నేను కృంగిపోకూడదని బలంగా నిశ్చయించుకున్నాను.

జైలులో ఉన్నప్పుడు, దాదాపు 15 నుంచి 16 గంటలు, సెల్‌లో ఏకాంతంగా ఉండాల్సి ఉంటుంది. ఎవరితోనూ సంభాషణకు అవకాశం ఉండదు. అందుకే నాతో నేను స్నేహం చేయడం అలవాటు చేసుకున్నాను.’ అని తెలిపారు.

మళ్లీ డిప్యూటీ సీఎంగా..
కాగా ఢిల్లీ ప్రభుత్వంలో తిరిగి ఉప ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నారా అనే ప్రశ్నకు సిసోడియా స్పందిస్తూ..  ప్రస్తుతానికి, పార్టీ కోసం పని చేయడం గర్వంగా ఉందని, పరిపాలనలో భాగం కావడానికి తొందరపడటం లేదని అన్నారు.

‘నేను జైలు నుంచి బయటకు వచ్చి నాలుగు రోజులైంది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ త్వరలో తిరిగి వస్తాడు.  ఆయన వచ్చాక నేను పార్టీ ప్రమోషన్‌లో ఉండాలా లేదా ప్రభుత్వంలో ఉండాలా అని ముఖ్యమంత్రి, పార్టీ సీనియర్ నాయకత్వం నిర్ణయిస్తుంది. ’ అని తెలిపారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)