భార్య బాలీవుడ్‌ భామలా ఉండాలని.. విపరీతంగా వ్యాయామం చేయించి..

Published on Thu, 08/21/2025 - 10:50

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో విచిత్ర వేధింపుల ఘటన చోటుచేసుకుంది. తన భర్త, అత్తామామలు తనను రోజూ మూడు గంటల పాటు వ్యాయామం చేయాలంటూ ఒత్తిడి తెస్తారని, కాదంటే తనకు ఆహారం పెట్టరని బాధితురాలు పోలీసుల ముందు వాపోయింది.

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన షాను(25) తన భర్త స్త్రీలోలుడని, ఇంటర్నెట్‌లో మహిళల అనుచిత వీడియోలను చూస్తుంటాడని ఆరోపించింది. బాలీవుడ్‌ భామ నోరా ఫతేహీలా ఉండాలంటూ తనను వేధిస్తుంటాడని తెలిపింది. అధిక వ్యాయామం కారణంగా తనకు గర్భస్రావం అయ్యిందని ఆమె వాపోయింది. 2025, మార్చి 6న షానుకు శివం ఉజ్జ్వల్‌ో వివాహం జరిగింది. షాను కుటుంబం ఈ వివాహం కోసం రూ. 76 లక్షలకు పైగా మొత్తాన్ని ఖర్చు చేసింది. కట్నం కింద రూ. 16 లక్షల విలువైన నగలు, రూ. 24 లక్షల విలువైన మహీంద్రా స్కార్పియో, రూ. 10 లక్షల నగదు ఇచ్చారు.

అత్తవారింటిలోకి అడుగుపెట్టిన షాను అక్కడ పలు ఇబ్బందులను ఎదుర్కొంది. షాను అత్త ఆమెను నిత్యం ఇంటి పనుల్లో బిజీగా ఉంచేది. శివంతో బయటకు వెళ్లేందుకు అనుమతించేదికాదు. ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అయిన శివం ఒకరోజు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, షాను మంచానికి దోమతెర అమర్చకపోవడంతో షానును అక్కడే వదిలేసి తన తల్లిదండ్రుల గదిలోనికి వెళ్లిపోయాడు. తరువాత అత్తమామలు ఆమెను తీవ్రంగా నిందించగా, భర్త ఆమెను కొట్టాడు. తాను అందంగానే ఉన్నప్పటికీ బాడీ షేమింగ్‌కు గురయ్యానని అమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన భర్త  యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లోని మహిళల అభ్యంతరకరమైన వీడియోలను చూస్తుంటాడని ఆమె పేర్కొంది.

బాలీవుడ్‌ భామ నోరా ఫతేహి లాంటి శరీరం కోసం తనచేత ప్రతిరోజూ మూడు గంటల పాటు వ్యాయామం చేయించేవాడని, ఏదైనా కారణంతో ఒక రోజు వ్యాయామం మానివేస్తే  ఆహారం పెట్టేవారి కాదని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. శివం అతని తల్లిదండ్రులు తరచూ నగదు, భూమి, నగలు  డిమాండ్ చేస్తుంటారని షాను పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)