KTR: నీ కేసులకు భయపడేది లేదు
Breaking News
మెట్రో స్టేషన్‌పై వ్యక్తి హల్‌చల్.. పోయే కాలం అంటే ఇదేనేమో భయ్యా!
Published on Sat, 08/20/2022 - 17:51
Metro station.. మనుషులు చేసే కొన్ని తప్పులు భారీ మూల్యాన్ని చెల్లించుకుంటాయి. చిన్న తప్పుల కారణంగా కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటి ఘటనే ఒకటి దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. పశ్చిమ ఢిల్లీలోని నంగ్లోయి మెట్రో స్టేషన్‌లో ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. మెట్రో రైల్వే ట్రాక్‌పై నడుస్తూ హంగామా క్రియేట్ చేశాడు. ఈ క్రమంలో మెట్రో కింద ఉన్న ప్రజలు కిందకు దిగాలని ఎంతగా అరుస్తున్నా, కేకలు వేస్తున్నా అతను మాత్రం అవేవీ పట్టించుకోకుండా కనీసం వారి వైపు కూడా చూడకుండా నడుచుకుంటూ వెళ్లాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేశారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. లంచ్ తర్వాత తిన్నది అరిగేందుకు మధ్యాహ్నం వాక్ చేస్తున్నాడని కామెంట్ చేశాడు.
A man running on a Track Near nangloi metro station Green Line @OfficialDMRC @ACPAshishKumar pic.twitter.com/NnwY7vka4I
— Ravi Rai (@RaviRai76784793) August 20, 2022
Tags : 1