Breaking News

స్మార్ట్‌వాచ్‌తో కిడ్నాపర్‌కు చుక్కలు.. యువకుని తెలివికి శభాష్‌!

Published on Wed, 12/17/2025 - 09:08

గ్వాలియర్‌: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో సినిమా లెవల్‌లో సాగిన కిడ్నాప్ డ్రామా సుఖాంతమైంది. తీసుకున్న అప్పు కంటే అధిక వడ్డీ కట్టాలని వేధిస్తూ, సౌరభ్ శర్మ అనే యువ హోటల్ మేనేజర్‌ను వడ్డీ వ్యాపారులు కిడ్నాప్ చేశారు. వారు అతనిని ఒక గదిలో బంధించి, చిత్రహింసలు పెడుతున్న సమయంలో అతను తన ప్రాణాలను కాపాడుకునేందుకు చేసిన ఆలోచన ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

తనను బంధించిన గదిలో కిడ్నాపర్ మర్చిపోయిన స్మార్ట్‌వాచ్‌ సౌరభ్ కంటపడింది. అదే అతనికి బ్రహ్మాస్త్రంలా పనిచేసింది. నిందితులు గమనించకుండా అత్యంత చాకచక్యంగా ఆ వాచ్ ద్వారా తన ప్రియురాలికి ఎమర్జెన్సీ కాల్ చేసి, తాను ఉన్న లొకేషన్‌ను షేర్ చేశాడు. ఆ ఒక్క కాల్‌తో కథ మొత్తం అడ్డం తిరిగింది.

సౌరభ్ ప్రియురాలు వెంటనే అతడి తండ్రికి సమాచారం ఇవ్వడం, వారు పోలీసులను ఆశ్రయించడంతో సీన్ రివర్స్ అయింది. గ్వాలియర్ పోలీసులు మెరుపు వేగంతో స్పందించి, కిడ్నాపర్లలో ఒకడిని పట్టుకుని విచారించారు. దీంత భయపడిన రెండో నిందితుడు సౌరభ్‌ను విడిచిపెట్టాడు. ఇప్పుడు ఇద్దరు నిందితులు ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నారు.

సాంకేతికతను సరైన సమయంలో ఉపయోగించుకోవడం ద్వారా ప్రాణాలు ఎలా కాపాడుకోవచ్చో ఈ ఘటన నిరూపించింది. "రుణ వివాదంతో మొదలైన ఈ కిడ్నాప్ కేసులో, బాధితుడి సమయస్ఫూర్తిని మెచ్చుకోవాల్సిందే" అని గ్వాలియర్ పోలీసులు అన్నారు. ప్రస్తుతం ఈ 'స్మార్ట్' రెస్క్యూ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇది కూడా చదవండి: బోండి బీచ్‌ ఘటన: వృద్ధ దంపతుల సాహసం.. వీడియో వైరల్‌

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)