దంపతులు మధ్య చిచ్చు రేపిన ట్రాఫిక్‌ కెమెరా పిక్స్‌..జైలుపాలైన భర్త

Published on Wed, 05/10/2023 - 17:26

కేరళ రాష్ట్రం ట్రాఫిక్‌ ఉల్లంఘనలు జరగకుండా ఉండేందుకు అత్యాధునిక ట్రాఫిక్‌ కెమరాలను ఏర్పాటు చేసింది. ఆ ట్రాఫిక్‌ కెమెరాలు ప్రస్తుతం వివాదస్పదమవ్వడమే గాక ఏకంగా ఓ కుంటుంబంలో కలతలు తెచ్చిపెట్టింది. కేరళలోని ఓ వ్యక్తి ఓ మహిళా స్నేహితురాలితో బైక్‌పై ప్రయాణించాడు. అతడు ఆ సమయంలో హెల్మెట్‌ ధరించలేదు.

దీంతో బైక్‌ ఎవరి పేరు మీద రిజిస్టర్‌ అయ్యిందో వారి మొబైల్‌కి ఫోటోతో సహా మెసేజ్‌ వెళ్లింది. ఐతే అతడి బైక్‌ భార్య పేరు మీద ఉండటంతో ఆమె మొబైల్‌కి మెసేజ్‌ వచ్చింది. దీంతో ఆమె బైక్‌పై ఎక్కించుకున్న మహిళ ఎవరని ప్రశ్నించింది భార్య. నిజానికి ఆ మహిళ ఎవరో తనకు తెలియదని, తాను కేవలం ఆమెకు లిఫ్ట్‌ ఇచ్చానని భార్యాతో చెప్పాడు.

కానీ ఆమె నమ్మలేదు. దీంతో ఇరువురి మద్య ఈ విషయమై గొడవలయ్యాయి. ఆ తర్వాత ఆమె తనపట్ల, కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆ వ్యక్తిని కోర్టులో హాజరుపర్చడమే గాక జ్యుడిషియల్‌ కస్టడీకి తరలించామని అధికారులు తెలిపారు. కాగా, సేఫ్‌ కేరళలో భాగంగా రోడ్డు భద్రతా ప్రాజెక్టు రహదారులపై ఈ అత్యాధునిక ట్రాఫిక్‌ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఈ కెమెరాల ఒప్పందాల్లో చాలా అవినీతి జరిగిందంటూ కేరళ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఆ  కెమెరాలు సామాన్య ప్రయాణికుల వ్యక్తిగత జీవితాలను ఇబ్బంది పాలు చేస్తుండటం బాధకరం. 

(చదవండి:  కేరళలో వైద్యురాలి మృతి కలకలం..చికిత్స చేస్తుండగా పెషెంట్‌..)

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)