Breaking News

సీఎం నివాసంలోకి చొరబాటుకు దుండగుడి యత్నం.. మారణాయుధాలతో..

Published on Fri, 07/21/2023 - 15:01

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లోకి దుండగుడు చొరబడేందుకు ప్రయత్నించాడు. ఆయుధాలతో కూడిన కారులో సీఎం ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కోల్‌కతా కాళీఘాట్‌లోని మమతా నివాసంలోకి ప్రవేశించేందుకు నిందితుడు యత్నించాడు.  

పోలీస్‌ స్టిక్కర్‌తో కూడిన వాహనంతో వచ్చిన ఆ వ్యక్తిని నూర్ ఆలంగా పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో దీదీ తన నివాసంలోనే ఉన్నారు. నగరంలో ఓ ర్యాలీలో పాల్గొనేందుకు మమతా బెనర్జీ తన నివాసం నుంచి బయల్దేరడానికి కొద్ది గంటల ముందు ఈ ఘటన జరిగింది.

మమత ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పాడని కోల్‌కతా సీపీ వినీత్ గోయల్ తెలిపారు. నిందితుడి వద్ద ఒక చాకుతోపాటు వివిధ ఆయుధాలు, గంజాయి కూడా దొరికాయని వెల్లడించారు.

బీఎస్‌ఎఫ్‌ తదితర ఏజెన్సీలకు సంబంధించిన అనేక గుర్తింపు కార్డులు అతని వద్ద లభ్యమయ్యాయని సీపీ వినీత్ గోయల్ పేర్కొన్నారు. ఘటనకు పాల్పడిన నిందితుడి అసలు ఉద్దేశం కనుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.  

ఇదీ చదవండి: రద్దీ రోడ్డు.. ట్రాఫిక్‌ జామ్‌ కాకూడదని.. బస్‌ డ్రైవర్‌గా మారిన బెంగళూరు ఏసీపీ!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)