Breaking News

Arvind Kejriwal: ఢిల్లీలో టెన్షన్‌.. కేజ్రీవాల్‌పై దాడికి యత్నం.!

Published on Sat, 11/30/2024 - 18:50

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై దాడికి ప్రయత్నం జరిగింది. వెంటనే అప్రమత్తమైన ఆప్ నాయకులు.. దాడికి పాల్పడిన యువకుడిని అడ్డుకున్నారు. దీంతో, అక్కడ ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది.

వివరాల ప్రకారం.. మాజీ సీఎం కేజ్రీవాల్‌ కైలాశ్‌ ప్రాంతంలో శనివారం పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనూహ్యంగా పాదయాత్రలోకి ఓ యువకుడు చొరబడి.. కేజ్రీవాల్‌పై దాడికి యత్నించాడు. తన చేతిలో ఉన్న ఏదో ద్రావణాన్ని కేజ్రీవాల్‌పై చల్లే ప్రయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన ఆప్ నాయకులు, కార్యకర్తలు.. సదురు యువకుడిని పట్టుకున్నారు. అనంతరం, అతడిని చితకబాదారు. ఈ ఘటనతో అక్కడి ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

 

అయితే, కేజజ్రీవాల్‌పై దాడి చేసింది బీజేపీ కార్యకర్తే అని ముఖ్యమంత్రి అతిశి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో దాడికి పాల్పడిన వ్యక్తికి సంబంధించిన ఫొటోను ఆమె.. తన ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. మోదీతో సహా అతను ఆ ఫొటోలో ఉండటం గమనార్హం.

ఇదిలా ఉండగా, అంతకుముందు కేజ్రీవాల్‌.. ఢిల్లీలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీని గ్యాంగ్‌స్టర్లు నడిపిస్తున్నారని ఆరోపించారు. నగరంలో నిత్యం కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఘాటు విమర్శలు చేశారు. ఢిల్లీని కొన్ని ముఠాలు నడిపిస్తున్నట్లు తనకు అనిపిస్తోందని సంచలన కామెంట్స్‌ చేశారు. దీంతో, మరోసారి కేంద్రం, ఆప్‌ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం మొదలైంది. అనంతరం, ఆప్‌ వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండించారు.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)