Breaking News

పోలీస్‌ స్టేషన్‌లోనే భార్యను కాల్చి చంపాడు

Published on Tue, 01/13/2026 - 07:26

హర్దోయి: భార్య ప్రియుడితో వెళ్లిపోయిందని ఫిర్యాదు చేసిన ఓ వ్యక్తి..పోలీస్‌స్టేషన్‌ ఆవరణలోనే ఆమెను తుపాకీ కాల్చి చంపాడు. ఈ ఘటన యూపీలోని హర్దోయిలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. పాలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రామ్‌పూర్‌ అతారియా వాసి అనూప్‌. ఇతడి భార్య సోనీ(35) వారం క్రితం ప్రియుడితో వెళ్లిపోయింది. నగలతోపాటు రూ.35 వేల నగదును ఆమె పట్టుకెళ్లిందంటూ అనూప్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

దీంతో, పోలీసులు సోనీని ఆదివారం పట్టుకొచ్చి, స్టేషన్‌లో ఉంచారు. సోమవారం అనూప్‌ను పిలిపించారు. సోనీని కోర్టులో హాజరు పర్చే రాత పనులు జరుగుతున్నాయి. పోలీస్‌స్టేషన్‌ ఆవరణలోనే ఉన్న క్యాంటిన్‌లోకి సోనీని ఓ మహిళా కానిస్టేబుల్‌ తీసుకెళ్తుండగా, అనూప్‌ అడ్డుకున్నాడు. వెంటతెచ్చుకున్న తుపాకీతో సోనీపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన సోనీ అక్కడికక్కడే చనిపోయింది. తప్పించుకునేందుకు ప్రయత్నించిన అనూప్‌ను పోలీసులు పట్టుకుని, తుపాకీని స్వా«దీనం చేసుకున్నారు.  

Videos

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

LIC కొత్త పాలసీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు

KA పాల్ బంపర్ ఆఫర్

Kurnool: SV మోహన్ రెడ్డి తనయుడి రిసెప్షన్ కు హాజరైన YS జగన్

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

DSC స్కామ్ బట్టబయలు లోకేష్ కి ఇచ్చిపడేసిన వరుదు కళ్యాణి

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)