Breaking News

రైలులో తోటి ప్యాసింజర్‌కు నిప్పు.. ముగ్గురి మృతి!

Published on Mon, 04/03/2023 - 08:10

కోజికోడ్‌: కేరళలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కదిలే రైలులో తన తోటి ప్రయాణికుడికి నిప్పటించగా.. బోగీలోని మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. అయితే ఇదే ఘటనలో.. పట్టాలపై పడి మరో ముగ్గురు చనిపోయారు. ఇందులో ఏడాది చిన్నారి ఉండడం గమనార్హం. 

ఆదివారం రాత్రి పది గంటల ప్రాంతంలో.. అలప్పుజ్జా కన్నూర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్‌లో ఈ ఘోరం జరిగింది. రైలు కోరాపుళ రైల్వే బ్రిడ్జి వద్దకు చేరుకోగానే..  గుర్తు తెలియని ఓ వ్యక్తి తన తోటి ప్యాసింజర్‌కు నిప్పటించాడు. ఆ మంటలు వ్యాపించి పక్కనే ఉన్న ఎనిమిది మంది ప్రయాణికులకు గాయలయ్యాయి. ఇది గమనించిన తోటి ప్రయాణికులు చెయిన్‌ లాగి.. సహాయం కోసం రైల్వేసిబ్బందికి ఫోన్‌ చేశారు. ఈ గ్యాప్‌లో నిందితుడు అక్కడి నుంచి తప్పించుకోగా..  గాయపడిన వాళ్లను ఆంబులెన్స్‌ల ద్వారా ఆస్పత్రికి తరలించారు. 

ఆపై రైలు కన్నూర్‌కి చేరుకోగా, ఓ మహిళ, చిన్నారి కనిపించకుండా పోయారనే ఫిర్యాదు అందింది. దీంతో.. వాళ్ల కోసం గాలింపు చేపట్టగా.. ఎళథూరు రైల్వే స్టేషన్‌ సమీపంలోని పట్టాల మీద సదరు మహిళ, ఏడాది వయసున్న చిన్నారితో పాటు మరో వ్యక్తి మృతదేహం లభ్యమయ్యాయి.

మంటల్ని చూసి భయంతో రైలు నుంచి దూకేయడమో లేదంటే ప్రమాదవశాత్తూ వాళ్లకు కిందపడిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆ మహిళ, ఆ చిన్నారికి బంధువని తేలింది. మరో వ్యక్తిని గుర్తించాల్సి ఉంది. దారుణానికి తెగబడిన వ్యక్తిగా అనుమానిస్తున్న వ్యక్తిని సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించి.. ట్రేస్‌ చేసే పనిలో ఉన్నారు పోలీసులు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)