Breaking News

ప్రధాని మోదీ భద్రతా వలయంలో కలకలం

Published on Sun, 09/24/2023 - 07:48

లక్నో: వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా వలయంలో కలకలం రేగింది.  ఉద్యోగం కావాలంటూ ఓ యువకుడు ప్రధాని మోదీ కాన్వాయ్ ముందు దూకాడు. ప్రధాని మోదీ కాన్వాయ్ లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయానికి వెళ్తుండగా రుద్రాక్ష సెంటర్ వెలుపల ఈ ఘటన జరిగింది.

ప్రధాని నరేంద్ర మోదీ నిన్న వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి భూమిపూజ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమం పూర్తి చేసుకుని తిరుగుప్రయాణంలో ఓ యువకుడు ప్రధాని మోదీ కాన్వాయ్ భద్రతా వలయాన్ని చీల్చుకుని లోపలికి వెళ్లాడు. ఉద్యోగం కావాలంటూ కాన్వాయ్‌ వెంట పరుగులు పెట్టాడు. గుర్తించిన పోలీసులు.. అతన్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని మోదీకి కేవలం 20 మీటర్ల దూరంలోనే ఉన్నాడని పోలీసులు చెప్పారు. 

నిందితున్ని ఘాజీపూర్‌కు చెందిన కృష్ణ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. బీజేపీ కార్యకర్తగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  మానసికంగా ఇబ్బందుల్లో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. అయితే.. ప్రధాని మోదీ భూమి పూజ చేసిన క్రికెట్ స్టేడియా 2025 డిసెంబర్ నాటికి పూర్తికానుంది. యూపీలో కాన్సూర్, లక్నో తర్వాత వారణాసిలో నిర్మించేదానితో మూడో క్రికెట్ స్టేడియం కానుంది.

ఇదీ చదవండి: అధికారంలోకి వస్తే బిల్లును సవరిస్తాం: ఖర్గే

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)