Breaking News

వావ్‌.. ఇలాంటి భర్త ప్రతి అమ్మాయికీ దొరకాలి..

Published on Wed, 07/22/2026 - 20:15

బిడ్డ పుట్టడం తల్లికే కాదు, తండ్రికీ ఎంతో ప్రత్యేకమైన క్షణం. ఇది జీవితంలో అత్యంత అద్భుతమైన అనుభవాల్లో ఒకటి. అయితే ప్రసవ ప్రక్రియ తల్లికి ఎంతో బాధాకరమైనది. ఆ బాధను శరీరంలో ఎన్నో ఎముకలు విరిగిన నొప్పితో పోలుస్తుంటారు. కానీ ప్రేమగా చూసుకునే జీవిత భాగస్వామి ఉంటే ఆ బాధ కూడా తక్కువగా అనిపిస్తుంది. అలాంటి దృశ్యమే ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని ఓ ప్రసూతి వార్డులో కనిపించింది. నవజాత శిశువును చూడకముందే, ప్రసవ వేదనను భరించిన తన భార్య వద్దకు ఓ భర్త పరుగెత్తి వెళ్లాడు.

ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ప్రసూతి, స్త్రీరోగ నిపుణురాలు డాక్టర్ ఉమ్ముల్ ఖైర్ ఫాతిమా తన అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలో ఈ వీడియోను పంచుకున్నారు. వీడియోలో డాక్టర్ నవజాత శిశువును చేతుల్లో పట్టుకుని భర్తను గదిలోకి పిలిచారు. సాధారణంగా తండ్రి ముందుగా బిడ్డను ఎత్తుకుంటాడని అందరూ భావిస్తారు. కానీ ఈ వీడియోలో భిన్నంగా జరిగింది.

గదిలోకి వచ్చిన ఆ వ్యక్తి, ఆ శిశువును పట్టించుకోకుండా నేరుగా తన భార్య వద్దకు వెళ్లాడు. బిడ్డ గది ప్రవేశద్వారం దగ్గరే ఉన్నా, అతను ముందుగా భార్యను గట్టిగా కౌగిలించుకుని చెంపపై ముద్దు పెట్టాడు. ప్రసవ వేదన నుంచి బయటపడిన ఆమె భావోద్వేగానికి గురైంది. 

ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తర్వాత ఆ వ్యక్తి డాక్టర్‌కు ధన్యవాదాలు తెలిపి, తన భార్యతో కలిసి బిడ్డను ప్రేమగా చూసుకున్నాడు. సామాజిక మాధ్యమాల్లో ఆ అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. వేల సంఖ్యలో లైక్‌లు, కామెంట్లు, షేర్లు వచ్చాయి. ఓ నెటిజన్ స్పందిస్తూ.. "దేవుడా... ఇలాంటి జీవిత భాగస్వామి అందరికీ దొరకాలి" అని పేర్కొన్నాడు.

 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)