Breaking News

26..26 : ప్రేమకు కొత్త అర్థం చెప్పిన ప్రియుడు, వైరల్‌ వీడియో

Published on Sat, 01/17/2026 - 13:02

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాల్ని, పుట్టినరోజు నాడు బాగాఇంప్రెస్‌ చేయాలని ఏ ప్రేమికుడైనా అనుకుంటాడు. సాధారణంగా పువ్వులు, చాక్లెట్లు, రింగ్స్‌, లేదా మరేదైనా సర్‌ప్రైజింగ్‌గా  తన ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తాడు. తాజాగా ఒక యువకుడు  తన ప్రియురాలి పుట్టిన రోజు సందర్భంగా  ఆమెను ఆకట్టుకోవాలని వినూత్నంగా ప్రయత్నించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట  తెగ సందడి చేస్తోంది.

తన స్నేహితురాలి 26వ పుట్టినరోజును పురస్కరించుకుని  అవిక్ భట్టాచార్య  అనే యువకుడు రొమాంటింగ్‌ ప్రయత్నించాడు. ఏకంగా 26 కిలోమీటర్లు పరిగెత్తాడు. ఈ వీడియోను  సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించాడు. భట్టాచార్య తన స్నేహితురాలు సిమ్రాన్‌ కలిసి ఉమ్మడిగా  @simranxavik అకౌంట్‌లో షేర్‌ చేశారు. దీంతో ఈ క్లిప్  వైరల్ అవుతోంది.అసలు విషయం ఏమిటంటే..

సిమ్రాన్ తన పుట్టినరోజున 26 కి.మీ పరిగెత్తాలని ప్లాన్ చేసుకుంది కానీ ఆమె అనారోగ్యం కారణంగా పరుగెత్తలేకపోయింది. దీంతో అవిక్‌ ఆ పనిచేసి ఆమె మనసు దోచుకున్నాడన్నమాట. అతను చేసిన పనికి ఆమె సంతోషంతో ఉబ్బితబ్బిబ్బై పోయింది.

వీడియో భట్టాచార్య ఇలా అంటాడు "నా స్నేహితురాలు ఇప్పుడే 26 ఏళ్లు నిండాయి, కాబట్టి నేను ఆమె పుట్టినరోజు కోసం 26 కి.మీ పరిగెత్తబోతున్నాను." అంటూ తన రొమాంటిక్‌ రన్‌ను  2 కి.మీ, 4 కి.మీ, 6 కి.మీ, 10 కి.మీ  అంటూ రికార్డ్ చేయడంతో పాటు, సిమ్రాన్ ఆరోగ్యంగా ఆనందాన్ని  ఉండాలని కోరుకున్నాడు. అలాగే మరికొన్ని వారాల్లో రాబోయే ముంబై మారథాన్‌కు శిక్షణ పొందుతున్నామని, ఈ ప్రత్యేకమైన పరుగును పూర్తిగా ఆమెకు అంకితం చేయాలనుకుంటున్నానని కూడా  వెల్లడించాడు. దీంతో నెటిజన్లు అవిక్‌ను  ప్రశంసలతో ముంచెత్తారు.

ఇదీ చదవండి: కన్నకూతుళ్లపై తండ్రి అఘాయిత్యం, 6 ఏళ్ల వయసు నుంచి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)