Breaking News

‘నాఫ్తలీన్’తో కప్పెట్టి.. పటకారుతో మోది.. దడపుట్టిస్తున్న రెండు ఘటనలు

Published on Sat, 08/23/2025 - 08:35

వార్ధా: మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి తన భార్య అదృశ్యమైందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మరిన్ని వివరాలు సేకరించేందుకు అతనిని ఫోన్‌లో సంప్రదించారు. అయితే ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ అయ్యింది. దీంతో పోలీసులు నేరుగా వార్ధాలోని హింగాన్‌ఘాట్‌లోని వారి ఇంటికి వెళ్లినప్పుడు అసలు విషయం బయటపడింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వార్ధాలోని హింగాన్‌ఘాట్‌కు చెందిన ఒక వ్యక్తి కొన్ని రోజుల క్రితం స్థానిక పోలీస్ స్టేషన్‌లో తన భార్య అదృశ్యమయ్యిందంటూ  ఫిర్యాదును చేశాడు. కేసు దర్యాప్తులో భాగంగా అతని ఇంటికి వెళ్లిన పోలీసులకు షాకింగ్‌ దృశ్యం కనిపించింది. ఆ ఇంటి సమీపంలో ఘాటైన వాసనను పోలీసులు గమనించారు.

అది నాఫ్తలీన్ బాల్స్‌ వాసనగా వారు గుర్తించారు. అలాగే అక్కడ గుంత తవ్విన ఆనవాళ్లు వారికి కనిపించాయి.  అక్కడ తవ్వి చూడగా, వారికి మహిళ మృతదేహం కనిపించింది. నాఫ్తలీన్ బా​ల్స్‌ ఘాటైన వాసన పోలీసుల దర్యాప్తులో కీలకంగా ఉపయోగపడింది. ఈ హత్య ఎలా జరిగిందనే వివరాలు ఇంకా వెల్లడికావలసి ఉంది. ఈ కేసులో అదృశ్యమైన భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు.

పటకారుతో దాడి చేసి..

హర్యానాలోని గురుగ్రామ్‌లో ఇటువంటి ఉదంతమే వెలుగు చూసింది.  భార్యను అత్యంత దారుణంగా చంపిన భర్తను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మనేసర్ ప్రాంతంలోని నహర్‌పూర్ కసన్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరాఖండ్‌కు చెందిన నిషా బిష్ట్ రాజేంద్రలకు 2024, డిసెంబర్‌లో వివాహం జరిగింది. గురుగ్రామ్‌లో ఉంటున్న వీరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. తాజాగా మరోమారు నిషా, రాజేంద్ర గొడవపడ్డారు. ఈ సమయంలో రాజేంద్ర వంటగదిలోని పటకారుతో ఆమెపై దాడి చేశాడు. తరువాత రోకలిబండతో మోదాడు.

ఆమె అపస్మారక స్థితిలోకి చేరాక, చున్నీతో గొంతు బిగించి హత్య చేశాడు. పోలీసులు శుక్రవారం ఉదయం నిషా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసుకున్నారు. రాజేంద్రను అరెస్టు చేశారు. అతను  నేరం అంగీకరించాడు. పోలీసులు ప్రస్తుతం అతనిని విచారిస్తున్నారు. 
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)