Breaking News

సహజీవనానికో అగ్రిమెంట్‌.. కోర్టు మెట్లెక్కిన యువతి

Published on Wed, 09/04/2024 - 10:59

ముంబై : వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. సహజీవనం చేసేందుకు సిద్ధమయ్యారు. హద్దులు దాటకూడదని నిబంధన పెట్టుకున్నారు. ఇందుకోసం ఒప్పందం కుదర్చుకున్నారు. కానీ ఏమైందో ఏమో ఉన్నట్లుండి ఆ యువతి కోర్టు మెట్లెక్కింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటుంది.పెళ్లి చేసుకుంటానని తన భాగస్వామి మోసం చేయడమే కాకుండా తనపై పలు మార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా..దీంతో సదరు వ్యక్తి శిక్ష నుంచి అతన తమ ఇద్దరి మధ్య జరిగిన అగ్రిమెంట్‌ను కోర్టుకు అందించాడు. ఆ తర్వాత ఏమైందటే?  

ముంబైలో కేర్‌ టేకర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ యువతి (29).. ప్రభుత్వ ఉద్యోగి (42)ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ముందుగా సహ జీవనం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇబ్బందులు రాకూడదని అగ్రిమెంట్‌ రాసుకున్నారు. అన్నట్లుగానే కొన్ని రోజులు కలిసి జీవించారు.  

ఈ నేపథ్యంలో తన భాగస్వామి తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని,సహజీవనం చేస్తున్న సమయంలో తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని యువతి కోర్టులో ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలి తరుఫు న్యాయవాది సైతం తమకు న్యాయం చేయాలని కోర్టుకు విన్నవించుకున్నాడు.

‘తనని తప్పుడు కేసులో ఇరికించారు. ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉండేందుకు అంగీకరించినట్లు అగ్రిమెంట్‌లో తేలింది. ఆమె సంతకం కూడా చేసింది’ అని ఆ వ్యక్తి తరఫు న్యాయవాది సునీల్ పాండే తెలిపారు. అందుకు ఒప్పంద పత్రాలు చూపించగా.. అందులో ఉన్న సంతకాలు తనవి కాదని బాధిత యువతి ఆరోపిస్తుంది.

వారి మధ్య జరిగిన సహజీవనం ఒప్పందం.. 
ఇరువురి మధ్య జరిగిన ఏడు అంశాల ఒప్పందం ప్రకారం 2024 ఆగస్టు 1 నుంచి 2025 జూన్ 30 వరకు కలిసి ఉండాలని నిర్ణయించారు.ఈ కాలంలో ఒకరిపై మరొకరు లైంగిక వేధింపుల కేసు పెట్టుకోరని, శాంతియుతంగా ఉండాలి. ఆమె ఇంట్లోనే అతడితో కలిసి ఉండాలి. అతని ప్రవర్తన సరిలేదంటే ఒక నెల నోటీసు ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా విడిపోవచ్చు.మహిళ అతనితో ఉంటున్నప్పుడు బంధువులు ఆమె ఇంటికి రాకూడదు.స్త్రీ పురుషుడికి ఎలాంటి వేధింపులు, మానసిక వేదన కలిగించకూడదు. అదే సమయంలో స్త్రీ గర్భం దాల్చితే పురుషుడు బాధ్యత వహించకూడదు. మానసిక ప్రశాంతత భంగం వాటిల్లకుండా చూసుకోవడం వంటి పాయింట్లు అగ్రిమెంట్‌లో చేర్చడంతో పాటు దాన్ని నోటరీ చేయించడం గమనార్హం. దీనిపై నెట్టింట చర్చ మొదలైంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)