Breaking News

చేదు అనుభవం.. బస్సులో ప్రయాణికురాలిపై యువకుడి మూత్ర విసర్జన

Published on Thu, 02/23/2023 - 09:14

సాక్షి బెంగళూరు: విమానంలో ఓ వృద్ధురాలిపై బెంగళూరుకు చెందిన బడా కంపెనీ ఉన్నతాధికారి మద్యం మత్తులో మూత్రం పోయడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. తాజాగా కర్ణాటక ఆర్టీసీ బస్సులో అటువంటి పాడు పని చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి విజయపుర నుంచి మంగళూరుకు వెళుతున్న కేఎస్‌ఆర్టీసీ స్లీపర్‌ బస్సులో ఈ దారుణం జరిగింది.

మార్గమధ్యంలో కిరేసూరు వద్ద భోజనం కోసం డ్రైవర్‌ బస్సును ఆపితే కొందరు దిగిపోయారు. 28వ సీటులో ఉన్న రామప్ప (25) అనే యువకుడు తన సీటు నుంచి లేచి వచ్చి 3వ నంబరు సీటులో కూర్చున్న ఒక యువతిపై మూత్ర విసర్జన చేశాడు. భయపడిన ఆ యువతి కిందకు దిగి డాబాలో భోజనం చేస్తున్న డ్రైవర్, కండక్టర్‌కు విషయం తెలిపింది.

డ్రైవర్, కండక్టర్‌ అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. మెకానికల్‌ ఇంజనీర్‌గా పనిచేస్తానని అతడు చెప్పాడు. మద్యం మత్తులో ఇలా చేసి ఉంటాడని అనుమానించారు. అతన్ని అక్కడే వదిలేసి బస్సు బయల్దేరింది.  

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)