Breaking News

రాత్రంతా ప్రియురాలి మృతదేహంతోనే ప్రయాణం.. ఏకంగా 350 కి.మీ

Published on Tue, 07/28/2026 - 20:33

ముంబై:  ప్రియురాలికి మరొక వ్యక్తితో సన్నిహిత సంబంధం ఉందని అనుమానించి, ఆమెను గొంతు నులిమి చంపేశాడు 40 ఏళ్ల ఓ వ్యక్తి. అనంతరం ఆమె మృతదేహాన్ని కారులో పెట్టుకుని కొల్హాపూర్ నుంచి థానే వరకు 350 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాడు.

నిందితుడి పేరు ప్రకాశ్ ఆనంద పాటిల్ (40). ఇతడు మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా షిర్‌గావ్ గ్రామానికి చెందినవాడు. బాధితురాలు సురేఖ శివాజినే ఆరే (40). ఆమె అదే గ్రామానికి చెందిన వితంతువు. ఆమెతో పాటిల్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు.

పోలీసుల సమాచారం ప్రకారం.. సురేఖకు మరొక వ్యక్తితో సంబంధం ఉందని పాటిల్ అనుమానించాడు. ఆదివారం ఉదయం షిర్‌గావ్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆమెను గొంతు నులిమి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. హత్య తర్వాత నిందితుడు మృతదేహాన్ని చుట్టి కారులో ఉంచి, నేరం జరిగిన ప్రాంతం నుంచి 350 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న థానే జిల్లా భివాండిలోని కసేలీ వైపు రాత్రంతా కారు నడిపాడు.

సోమవారం ఉదయం భివాండిలో ఓ స్థానికుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. వాహనాన్ని గుర్తించి పాటిల్‌ను అదుపులోకి తీసుకుని, కారులో ఉన్న మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 103(1) కింద జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కోసం నేరం జరిగిన ప్రాంత పరిధిలోని పోలీస్ స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు. థానే చేరుకున్న తర్వాత మృతదేహంతో నిందితుడు ఏం చేయాలనుకున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)