Breaking News

పాకిస్తాన్‌ ప్రేమికురాలి కోసంసరిహద్దులు దాటిన యూపీ వాసి

Published on Wed, 01/01/2025 - 12:50

లక్నో: సామాజిక మాధ్యమ వేదిక ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమయ్యారు. ఆపైన ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ప్రియుడు యూపీ వాసి కాగా ప్రియురాలు పాకిస్తానీ. ఆమెను పెళ్లి చేసుకునేందుకు దొంగచాటుగా సరిహద్దులు దాటి పాకిస్తాన్‌ వెళ్లాడు. ప్రేమికురాలిని కలుసుకున్నాడు. అక్కడి పోలీసులకు దొరికిపోయి జైలు ఊచలు లెక్కిస్తున్నాడు.

 యూపీలోని అలీగఢ్‌ జిల్లా నగ్లా ఖట్కారి గ్రామానికి చెందిన ప్రియుడు బాదల్‌ బాబు(30) కథ ఇది. పాక్‌ ప్రియురాలి కోసం ఇప్పటికే ఇతడు 2024 జులైలో ఒక పర్యాయం సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించాడు. బీఎస్‌ఎఫ్‌ జవాన్లు ఖఖర్‌ పోస్ట్‌ వద్ద ఇతడిని పట్టుకుని జమ్మూకశ్మీర్‌ పోలీసులకు అప్పగించారు. దీంతో తిరిగి సొంతింటికే చేరాడు. 

తాజాగా రెండో ప్రయత్నంలో విజయం సాధించాడు. సరిహద్దులు దాటి పంజాబ్‌లోని మండి బహాఉద్దీన్‌ నగరంలో ప్రేమికురాలిని కలుసుకున్నాడు. అయితే, ఎలాంటి ప్రయాణ పత్రాలు, వీసా వంటివి లేకపోవడంతో డిసెంబర్‌ 27వతేదీన అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇతడిపై పారినర్స్‌ చట్టం కింద కేసు పెట్టారు. కోర్టు ఇతడిని 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి పంపించింది. జనవరి 10వ తేదీన కేసు విచారణకు రానుందని పాక్‌ అధికారులు               వెల్లడించారు.  

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)