Breaking News

మ్యూజియంలో చోరీకి వచ్చి.. పోలీసులకు చిక్కాడిలా..

Published on Wed, 09/04/2024 - 09:49

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో గల స్టేట్ మ్యూజియంలో చోరీకి వచ్చిన దొంగ తాను ఊహించని రీతిలో పోలీసుల చేతికి చిక్కాడు. మ్యూజియంలోని కోట్లాది రూపాయల విలువైన వందల ఏళ్లనాటి పురాతన వస్తువులతో  పారిపోయేందుకు ఆ దొంగ విఫలయత్నం చేశాడు.

ఈ ఉదంతం గురించి పోలీసు కమిషనర్ హరినారాయణచారి మిశ్రా మీడియాకు వెల్లడించారు. స్టేట్‌ మ్యూజియంలోకి ప్రవేశించిన ఒక వ్యక్తి రాత్రంతా లోపలే ఉండిపోయాడు. ఉదయం భద్రతా సిబ్బంది అతన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు మ్యూజియంనకు చేరుకుని అతనిని అరెస్టు చేశారు. నాణేలను, ఇతర వస్తువులను దొంగిలించి, మ్యూజియం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో  ఆ దొంగ గోడపై నుంచి దూకి తీవ్రంగా గాయపడ్డాడు దీంతో కదలలేకపోయాడు. తరువాత అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతడిని ఉదయం భద్రతా సిబ్బంది గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఆ దొంగ దగ్గరి నుంచి గుప్తులు, సుల్తానేట్ కాలానికి చెందిన 100 నాణేలతో పాటు పురాతన నగలు, పాత్రలు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ నాణేల విలువ దాదాపు రూ.10 నుంచి 12 కోట్ల వరకూ వరకు ఉంటుందని సమాచారం. ఈ సంఘటన నేపధ్యంలో భోపాలోని మ్యూజియం భద్రతా ఏర్పాట్లపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇకనైనా ప్రభుత్వం మ్యూజియంనకు పటిష్టమైన భద్రతను కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)