Breaking News

కండక్టర్‌ను దోచుకుని..  36 ఏళ్ల తర్వాత దొరికిపోయి.. 

Published on Mon, 07/13/2026 - 06:25

కోజికోడ్‌: కేరళలో బస్సు కండక్టర్‌ను తుపాకీతో బెదిరించి టికెట్‌ విక్రయ నగదును దోచుకుని పరారైన ఒక వ్యక్తిని ఏకంగా 36 సంవత్సరాల తర్వాత ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు కేరళ నుంచి పారిపోయి కర్ణాటకలోని మైసూరులో మారుపేరుతో జీవిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. భార్య పెట్టిన వేధింపుల కేసు ఇతడిని ఎట్టకేలకు పట్టిచ్చింది. 

71 ఏళ్ల వయస్సులో అనుకోకుండా ఇతను పోలీసులకు దొరికిపోయాడు. కేరళలోని మలప్పురం జిల్లా అరికోడ్‌కు చెందిన వీకే జోస్‌ 1990లో కేరళ కేఎస్‌ఆర్టీసీ బస్సు థిరువంబాడీ నుంచి కూంబారా పట్టణానికి వెళ్తున్నప్పుడు అందులోని కండక్టర్‌ను తుపాకీతో బెదిరించి కండక్టర్‌ వద్ద ఉన్న రోజువారీ టికెట్‌ కలెక్షన్‌ సొమ్మును నిందితుడు లాక్కొని పరారయ్యాడు. ఈ కేసులో ఇతనిపై కోర్టు అప్పట్లోనే అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు ఇతడు శివకుమార్‌ అనే మారుపేరుతో మైసూరులోని నరసింహరాజా ప్రాంతంలో జీవించడం మొదలెట్టాడు. 

పెళ్లిచేసుకుని భార్య, పిల్లలతో ఉంటున్నాడు. అయితే తనను భర్త వేధిస్తున్నాడంటూ ఇతని భార్య జూలై 8వ తేదీన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు విచారణలో భాగంగా పోలీసులు ఇతని ఇంట్లో సోదాలు చేయగా ఒక తుపాకీ లభించింది. తుపాకీ లైసెన్స్‌ వివరాలు ఆరా తీయగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో ఇతని వివరాలను కేరళ పోలీసులకు మైసూరు పోలీసులు పంపించారు. దీంతో ఇతనిపై మూడు దశాబ్దాల క్రితం చోరీ కేసు నమోదైనట్లు గుర్తించి వెంటనే అరెస్ట్‌చేశారు. తర్వాత కేరళలోని థిరువంబాడీకి తీసుకొచ్చి జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు.  
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)