Breaking News

కుటుంబాన్ని చిదిమేసిన ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ!

Published on Sun, 10/12/2025 - 05:40

సాక్షి, చెన్నై: ఇన్‌స్టాగ్రామ్ ఓ కుటుంబాన్ని చిదిమేసింది. ఇందులో పరిచయమైన వ్యక్తితో భార్య వెళ్లిపోవడంతో భర్త ఉన్మాదిగా మారాడు. తన ము­గ్గు­రు పిల్లల్ని గొంతు కోసి చంపేసి ఆపై పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన తమిళనాడులోని తంజా­వూరు జిల్లా పట్టుకోట్టైలో శనివారం వెలుగుచూసింది. ఈ ప్రాంతంలోని కోయిల్‌ సముద్రం గ్రామానికి చెందిన వినోద్‌ కుమార్‌ (38), నిత్య (35)కు పన్నెండేళ్ల క్రితం వివాహమైంది.

తొలుత వినోద్‌ కుమార్‌ సొంతంగా వ్యాపారం చేయగా.. నష్టాలు రావడంతో ఫొటోగ్రాఫర్‌గా మారి ఆపై ఓ హోటల్‌లో పనికిచేరాడు. ఈ దంపతులకు కుమార్తెలు ఓవియ­(11), కీర్తి(8), కుమారుడు ఈశ్వర్‌(5) ఉన్నారు. ఆర్థికంగా నష్టపోవడంతో ఆ కుటుంబాని­కి సమస్యలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో నిత్య ఇన్‌స్టాగ్రామ్లో పోస్టులు పెట్టడం మొదలుపెట్టింది.

వాటికి ఆకర్షితుడైన మన్నార్‌గుడికి చెందిన ఓ యువకుడు ఆమెను బుట్టలో వేసుకున్నాడు. ఆమె ఆర్థిక కష్టాలను గుర్తించి ఆ ఇంటికి కావాల్సిన వస్తువులను కొనిస్తూ ఆమెకు దగ్గరయ్యాడు. వీరిద్దరూ సన్నిహితంగా మెలగుతుండటాన్ని గుర్తించిన వినోద్‌కుమార్‌.. నిత్యను మందలించాడు. దీంతో తనకు విలాసవంతమైన జీవితం కావాలంటూ ఆ యువకుడితో నిత్య ఇటీవల వెళ్లిపోయింది.

ఉన్మాదిగా మారి...
ఆమెను బతిమిలాడినా తిరిగి రాకపోవడంతో విజయ్‌కుమార్‌ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో పెద్ద కుమార్తె ఓవియ బడి మానేసి తన చెల్లి, తమ్ముడి లాలన చూసుకునేది. క్రమంగా వినోద్‌కుమార్‌ మానసికంగా కుంగిపోతూ ఉన్మాదిగా మారాడు. శుక్రవారం రాత్రి పకోడీని తన తమ్ముడు, చెల్లికి ఓవియ తినిపిస్తుండగా, మద్యం మత్తులో వచ్చిన వినోద్‌కుమార్‌ ఓవియ, ఈశ్వర్‌ను బయటకు పంపించాడు.

మరో కుమార్తె కీర్తిని తన ఒడిలో పెట్టుకుని లాలిస్తూ, క్షణాల్లో కత్తితో ఆమె గొంతు కోసేశాడు. కీర్తి పెడుతున్న కేకలతో ఓవియ, ఈశ్వర్‌ ఇంట్లోకి పరుగులు తీశారు. క్షణాల్లో మిగిలిన ఇద్దరినీ గొంతుకోసి చంపేశాడు. రక్తపు మడుగులో మరణించిన పిల్లలను చూసి ఏడుస్తూ, తన భార్యకు గుణపాఠం చెప్పేశానంటూ తాను పనిచేస్తున్న హోటల్‌కు వెళ్లి ఈ విషయాన్ని చెప్పాడు. అక్కడి నుంచి మదు­క్కూర్‌ పోలీసు స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)