Breaking News

పెళ్లిపీటలపై వధువు తల్లి.. అప్పుడే మొదలైంది అసలు కథ!

Published on Sun, 04/20/2025 - 09:33

లక్నో: ఓ పెళ్లి పందిరిలో ఘరానా మోసం వెలుగు చూసింది. వధువు బదులు ఆమె తల్లి పెళ్లి పీఠలెక్కింది. పెళ్లి తంతులో వధువు తన అసలు పేరు బదులు మరో పేరు పలకడంతో పక్కనే ఉన్న వరుడికి అనుమానం వచ్చింది. ముసుగు తొలగించి చూడగా.. అసలు విషయం బయటపడింది. దీంతో తాను మోసపోయానని వరుడు గ్రహించాడు. వధువు బదులు ఆమె తల్లి ఎందుకు ఉందని ప్రశ్నించారు. వధువు తరుఫు కుటుంబ సభ్యులు బెదిరించడంతో పెళ్లి పంచాయితీ పోలీస్‌స్టేషన్‌కు చేరింది.

పోలీసుల వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్‌ (uttar pradesh)  మీరట్‌లో (meerut) బ్రహ్మపురికి చెందిన వరుడు (22)కు శామలీ జిల్లావాసి వధువు (21)తో పెళ్లి కుదిరింది. కుదుర్చుకున్న సమయానికి పెళ్లి చేసేందుకు కుటుంబసభ్యులు సిద్ధమయ్యారు. పెళ్లి తంతు మొదలైంది. అయితే, సరిగ్గా అప్పుడే వధువు తన పేరు చెప్పాల్సి ఉంది. బదులుగా ఆమె తల్లి పేరు చెప్పింది. ఇదేంటని బిత్తరపోయిన పెళ్లి కొడుకు వధువు ధరించిన ముసుగును తొలగించాడు.

అంతే, వధువు బదులు ఆమె తల్లి ఉందని చూసి కంగుతిన్నాడు. ఇదే విషయాన్ని పెళ్లి పెద్దల్ని ప్రశ్నించాడు. పెళ్లి పెద్దలు సైతం వధువు తల్లికి మద్దతు పలికారు. వధువు తల్లిని పెళ్లి చేసుకోవాల్సిందేనని వరుడిని హెచ్చరించారు. లేదని అల్లరి చేస్తే రేప్‌ కేసులో ఇరికిస్తామని బెదిరించారు. తాను పూర్తిగా మోసపోయానని గ్రహించిన వరుడు పోలీసుల్ని ఆశ్రయించాడు.

‘నాకు వధువు బదులు ఆమె తల్లిని ఇచ్చి పెళ్లి చేసేందుకు కుట్ర చేశారు. పెళ్లి కోసం రూ.5లక్షలు ఖర్చు చేశా. మీరే న్యాయం చేయండి’ అంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)