Breaking News

ఒట్టి చేతులతో చిరుతపై పోరాటం .. యువకుడి ధైర్యానికి నెటిజన్ల షాక్‌!

Published on Wed, 06/25/2025 - 18:47

లక్నో: తన ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించిన చిరుతపులిపై ఓ యువకుడి ఒంటి చేత్తో పోరాడాడు. ఎలాంటి ఆయుధాలు లేకుండా చిరుతపులిపై తిరగబడ్డాడు. ఆపత్కాలంలో తెగువ, ధైర్య సాహాసానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన ఆ వ్యక్తి పేరు మిహిలాల్ గౌతమ్‌ (33). అతనిది ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం. చిరుతపులిపై పోరాటం చేసిన ఘటన లఖ్మీపూర్ ఖేరిలోని జుగనూపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.  

అటవి శాఖ అధికారుల సమాచారం మేరకు.. మిహిలాల్‌ గౌతమ్‌ది ఇర్ధారి పూర్వా అనే గ్రామం.ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు గౌతమ్‌తో పాటు మరికొందరు సోమవారం  జుగనూపూర్‌ గ్రామానికి వచ్చారు.ఇటుక బట్టీల్లో పని ప్రారంభించేందుకు గౌతమ్‌తో పాటు ఇతర కార్మికులకు కలిసి ఇటుకుల్ని వేడి చేసే కొలిమి ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. సరిగ్గా అదే సమయంలో అక్కడే సేదతీరుతున్న చిరుతపులి కార్మికులపై దాడి చేసేందుకు ఒక్క ఉదుటున మీద పడింది.

ఒట్టి చేతుల్ని ఆయుధాలుగా మార్చి
దాడి చేస్తున్న చిరుతపులిని భయపడకుండా, గందరగోళానికి గురవుకుండా గౌతమ్‌ తన ఒట్టి చేతుల్నే ఆయుధాలుగా మార్చి  దానిని నిలురించే ప్రయత్నం చేశాడు. ఏ మాత్రం బెదరకుండా చిరుతపై ఎదురు దాడికి దిగాడు. ఆ ప్రయత్నాలు సఫలమయ్యాయి. గౌతమ్‌ బలాబలాల ముందు చిరుత తేలిపోయింది. అప్రమత్తమైన సహచర కార్మికులు గ్రామస్తుల సాయంతో చిరుత నుంచి గౌతమ్‌ను రక్షించే ప్రయత్నం చేశారు. చేతికి దొరికిన వస్తువుల్ని చిరుతపైకి విసిరేస్తూ చిరుతను భయబ్రాంతులకు గురిచేసేందుకు యత్నించారు. ఆ ప్రయత్నంలో చిరుత భయపడి స్థానిక అరటితోటల్లోకి పారిపోయింది. 

 అధికారులపై చిరుత దాడి
చిరుతపులి దాడిపై స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ ప్రయత్నంలో అధికారులపై చిరుత దాడికి దిగింది. ఈ దాడిలో ఫారెస్ట్‌ రేంజ్‌ రాజేష్‌ కుమార్‌ దీక్షిత్‌,రేంజర్‌ నిరూపేంద్ర చతుర్వేది, పోలీస్‌ అధికారి రామ్‌ సంజీవన్‌,స్థానిక గ్రామస్తుడు ఇక్బాల్‌కు గాయాలయ్యాయి.  

అత్యవసర చికిత్స నిమిత్తం తొలిసారి దాడికి చేసిన మిహిలాల్‌ గౌతమ్‌తో పాటు ఇక్బాల్‌ ఖాన్‌ ,ఫారెస్ట్‌ రేంజర్‌ రాజేష్‌ కుమార్‌ లక్ష్మీపూర్‌ ఆస్పత్రికి, రేంజర్‌ చతుర్వేది, పోలీస్‌ కానిస్టేబుల్‌ రామ్‌ సంజీవన్‌లను తాలూకా ఆస్పత్రికి తరలించారు. వైద్య చికిత్స అనంతరం బాధితులు ఆస్పత్రి నుంచి డిశార్జ్‌ అయినట్లు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు.

ఈ ఘటన తర్వాత అంటే మంగళవారం అదనపు పోలీసు సిబ్బందితో కలిసి అటవీ శాఖ, పోలీస్‌ శాఖ జాయింట్‌ ఆపరేషన్‌ను నిర్వహించాయి. అరటితోటల్లోనే ఉన్న చిరుత పులిని బంధించాయి. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)