Breaking News

‘హెచ్‌ఐవీ’కి ఏఐ సలహా.. ఆరోగ్యం విషమించి..

Published on Sat, 01/31/2026 - 09:16

న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ) సాయం తీసుకున్న కొందరు చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా ఢిల్లీకి చెందిన 45 ఏళ్ల వ్యక్తి ఏఐ సలహాను పాటించి, ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. వైద్యుడిని సంప్రదించకుండా ఒక ఏఐ చాట్ ప్లాట్‌ఫామ్ ఇచ్చిన సలహాతో హెచ్‌ఐవీ నిరోధక మందులు వాడి, ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. లైంగిక సంబంధం తర్వాత హెచ్‌ఐవీ సోకుతుందనే భయంతో, అతను ముందు జాగ్రత్తగా ఏఐ సలహాతో కొన్ని మందులను వాడాడు.

వైద్యుల పర్యవేక్షణ లేకుండా సొంతంగా మందులు తీసుకోవడం వల్ల అతనికి 'స్టీవెన్స్-జాన్సన్ సిండ్రోమ్'  అనే అరుదైన, ప్రాణాంతక చర్మ వ్యాధి సోకింది. ఈ నేపధ్యంలో అతను ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు ఏఐ సూచనలతో స్థానిక కెమిస్ట్ షాపు నుండి ఎటువంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే 28 రోజుల కోర్సును కొనుగోలు చేశాడు. ఈ మందులను ఏడు రోజుల పాటు వాడిన తర్వాత, అతని శరీరంపై దద్దుర్లు రావడం ప్రారంభమైంది.

ఆరోగ్య పరిస్థితి విషమించి, అతనికి కంటి సమస్యలు ఇతర ఇబ్బందులు తలెత్తాయి. దీంతో పలు  ఆస్పత్రుల చుట్టూ తిరిగిన అనంతరం చివరకు రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చేరాడు. ప్రస్తుతం అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, డ్రగ్ రియాక్షన్‌ను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చికిత్స అందిస్తున్న సీనియర్ వైద్యులు తెలిపారు. జాతీయ మార్గదర్శకాల ప్రకారం హెచ్‌ఐవీ నిరోధక మందులను వైద్యుల క్షుణ్ణమైన పరిశీలన, రిస్క్ అసెస్‌మెంట్, బేస్‌లైన్ పరీక్షల తర్వాతే అందించాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.  

ఎటువంటి పర్యవేక్షణ లేకుండా యాంటీ రిట్రోవైరల్ మందులు వాడటం వల్ల శరీర అవయవాలు దెబ్బతినడం, చివరికి ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐ సాధనాలు కేవలం సాధారణ సమాచారాన్ని మాత్రమే ఇవ్వగలవని, అవి ఎప్పటికీ వైద్యుని క్లినికల్ నిర్ణయానికి ప్రత్యామ్నాయం కాబోవని వైద్యులు  చెబుతున్నారు. ఆరోగ్య సమస్యల విషయంలో ఏఐ జోక్యాన్ని పరిమితం చేసేలా ప్రభుత్వం తగిన ప్రమాణాలను తీసుకురావాలని వారు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ప్రతిష్టంభనకు చెక్‌.. సంతకాలే తరువాయి..

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)