Breaking News

చెంప దెబ్బకు చంపేశాడు!

Published on Sun, 01/25/2026 - 06:37

న్యూఢిల్లీ: శుక్రవారం రాత్రి నార్త్‌ ఈస్ట్‌ ఢిల్లీలోని మౌజ్‌పూర్‌లోని ఆ కేఫ్‌ ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉంది. కానీ, ఒక్కసారిగా పేలిన తుపాకీ గుళ్లు అలజడి రేపాయి. వెల్కమ్‌ ప్రాంతానికి చెందిన ఫైజాన్‌ అలియాస్‌ ఫజ్జీ (24) అనే యువకుడు కేవ్‌లో ఉండగా.. తల, ఛాతీలో తూటాలు దిగి అక్కడికక్కడే కుప్పకూలాడు. తీవ్ర గాయాలైన ఫైజాన్‌ను ఆసుపత్రికి తరలించేలోపే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఘటన జరిగిన కొద్దిసేపటికే హంతకుడు ఇన్‌స్ట్రాగామ్‌లో ప్రత్యక్షమై నేరాన్ని అంగీకరించడం 
సంచలనం సృష్టిస్తోంది. 

ఔను.. నేనే చంపేశా.. 
హత్య జరిగిన కొన్ని గంటలకే నిందితుడు తన ఇన్‌స్ట్రాగామ్‌ ఖాతాలో ఒక వీడియో పోస్ట్‌ చేశాడు. ఏమాత్రం పశ్చాత్తాపం లేని ఆ గొంతు వింటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ‘నేనే ఫైజాన్‌ను చంపాను. నాలుగు నెలల క్రితం వాడు నన్ను అందరి ముందు చెంపదెబ్బ కొట్టాడు. ఆ అవమానాన్ని భరించలేకపోయాను.. అందుకే ఇప్పుడు వాడి ప్రాణం తీశాను. ఇందులో మా కుటుంబానికి, స్నేహితులకు సంబంధం లేదు. ఇది కేవలం నా వ్యక్తిగత కక్ష!’.. అంటూ నిందితుడు కెమెరా ముందు ఒప్పుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  

అప్పు తీర్చమన్నందుకే.. 
హత్యకు కారణం పాత కక్ష అని నిందితుడు బుకాయిస్తున్నా, బాధితుని కుటుంబం మాత్రం మరో భయంకరమైన కోణాన్ని బయటపెట్టింది. నిందితుడు ఫైజాన్‌ దగ్గర రూ.40,000 అప్పు తీసుకున్నాడని, ఆ డబ్బులు తిరిగి అడిగినందుకే పక్కా ప్లాన్‌తో చంపేశాడని మృతుని సోదరుడు సల్మాన్‌ ఆరోపిస్తున్నాడు. ‘వాడు కేవలం కాల్చడమే కాదు, కత్తితో కూడా పొడిచాడు. నా తమ్ముడు ప్రాణాల కోసం ఎంత పోరాడాడో ఆ గాయాలే చెబుతున్నాయి’.. అంటూ సల్మాన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.  

అక్రమ కేఫ్‌ సీజ్‌ 
ఈ ఘటనతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు.. అక్రమంగా నడుస్తున్న ఆ కేఫ్‌ను వెంటనే సీజ్‌ చేశారు. నిందితుడు పోస్ట్‌ చేసిన వీడియో నిజమేనా? లేక తప్పుదోవ పట్టించే కుట్రా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.


 

Videos

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)