పిల్లల కోసం కాపురం.. రెండోసారీ భార్య మోసం!

Published on Tue, 12/16/2025 - 13:17

అమృత్‌సర్‌: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జరిగిన ఓ ఉదంతం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. అమృత్‌సర్‌కు చెందిన రవి గులాటి 15 ఏళ్లుగా తన భార్య హిమానీతో సంసారం సాగిస్తున్నాడు. అయితే తాజాగా అతను తన భార్యను ఒక హోటల్‌లో మరొక వ్యక్తితో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ విధంగా ఆమె భర్తను మోసం చేయడం ఇది మొదటిసారి కాదు.

భర్త తెలిపిన వివరాల ప్రకారం 2018లో కూడా ఆమె ఒక హోటల్‌లో వేరే వ్యక్తితో పట్టుబడింది. అప్పుడు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రవి సంసారం కొనసాగించాడు.  అలాగే  ఆ సమయంలో భార్య తన తల్లిదండ్రుల సమక్షంలో క్షమాపణ చెప్పడంతో, పరిస్థితి చక్కబడుతుందని రవి ఆశించాడు. కానీ భార్య తీరుతెన్నులో ఏమాత్రం మార్పు రాలేదు. గతంలో జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకుని రవితన భార్యకు చెందిన యాక్టివా వాహనానికి రహస్యంగా జీపీఎస్ ట్రాకర్‌ను అమర్చాడు. ఒకరోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లింది.

ఇంతలో రవి పదేపదే ఫోన్ చేసినా ఆమె సమాధానం ఇవ్వకపోవడంతో అతనిలో అనుమానం పెరిగింది. జీపీఎస్‌ లొకేషన్‌ను అనుసరించి రవి ఒక హోటల్‌కు చేరుకున్నాడు. అక్కడ రవి తన భార్య మరో వ్యక్తితో ఉండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ ఘటన దరిమిలా రవి తండ్రి పర్వేజ్ గులాటి ఆమె ఇక తన కుమారునితో ఉండనక్కరలేదని, వారి పుట్టింటికి వెళ్లిపోవాలని తెగేసి చెప్పాడు. కాగా ఆమెతో పాటు పట్టిబడిన వ్యక్తిని ఆమె గతంలో తన సోదరునిగా భర్తకు పరిచయం చేసిందని పర్వేజ్ గులాటి తెలిపారు. రవి తండ్రి పర్వేజ్ తెలిపిన వివరాల ప్రకారం ఆ వ్యక్తితో హిమానీ ఏడేళ్లుగా రహస్యంగా సంబంధం కొనసాగిస్తోంది. గతంలో క్షమాపణతో ఈ సమస్య శాంతియుతంగా ముగిసిందని భావించామని, అయితే అదే తప్పు మళ్లీ జరగడంతో  ఆమెపై గౌరవం పూర్తిగా పోయిదని పర్వేజ్‌ తెలిపారు. ఈ కథనం ‘న్యూస్‌ 18’లోని వివరాల ఆధారంగా రాయడం జరగింది.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)