Breaking News

కన్నకూతుళ్లపై తండ్రి అఘాయిత్యం, 6 ఏళ్ల వయసు నుంచి

Published on Fri, 01/16/2026 - 13:02

జోధ్‌పూర్‌లో దారుణ ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత 12 ఏళ్లుగా కన్న కూతుళ్లపై ఒక తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. తల్లీ కూతుళ్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

పోలీసుల సమాచారం ప్రకారం జోధ్‌పూర్‌కు చెందిన 18 ఏళ్ల బాలిక గత 12 ఏళ్లుగా తన తండ్రి తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఆరోపించింది. తన తండ్రి తనపై అత్యాచారం చేయడం ప్రారంభించినప్పుడు ఆమె వయస్సు కేవలం ఆరేళ్లు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి లైంగిక దాడికి పాల్పడుతూ వచ్చాడు. చివరికి తన 15 ఏళ్ల చిన్న కుమార్తెపై కూడా అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని  బాలిక తన సోదరితో చెప్పింది. దీంతో వారు  తమ తల్లికి ఈ విషయాన్ని తెలియజేశారు. ఆ తర్వాత, వారు పోలీసులకు ఒక ఈమెయిల్ ద్వారా  ఫిర్యాదు చేశారు.  జనవరి 13న ఒక ఈమెయిల్ ఫిర్యాదు అందిందని  నాగౌరి గేట్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) దినేష్ కుమార్ తెలిపారు.  

ఆరోపణల తీవ్రత దృష్ట్యా, పోలీసులు వెంటనే ఫిర్యాదుదారురాలిని సంప్రదించి, ఆ తర్వాత ఆమె నుండి అధికారిక లిఖితపూర్వక ఫిర్యాదును స్వీకరించారు. సహాయ పోలీస్ కమిషనర్ (ఏసీపీ) మంగ్లేష్ చుండవత్ ప్రకారం,తనపై ఫిర్యాదు నమోదైన విషయం  తెలియడంతో నిందితుడు, కూలీగా పనిచేసే 45 ఏళ్ల తండ్రి పరారయ్యాడు. కానీ గురువారం అదుపులోకి తీసుకున్నారు.శుక్రవారం మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. పోలీసులు ఇప్పటికే బాధితుల వాంగ్మూలాలను నమోదు చేసి, వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు.సెక్షన్ 65(2) (అత్యాచారం) ,లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద  నిందితుడిపై కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: టీనేజ్‌ లవర్స్‌ : 40 ఏళ్లకు 60లలో మళ్లీ పెళ్లి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)