Breaking News

తల నరికి చంపిన కేసులో నిందితుడికి విముక్తి.. కోర్టు ఏం చెప్పిందంటే...

Published on Sun, 04/16/2023 - 21:31

తన సహోద్యోగిని నరికి చంపిన కేసులో నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది మహారాష్ట్రలోని థానే జిల్లా కోర్టు. ఈ మేరకు 38 ఏళ్ల నేపాల్‌ జాతీయుడు రాజేష్‌కుమార్‌ నేపాలీ అలియాస్‌ యజ్ఞప్రసాద్‌ కాలూరామ్‌ పుఖ్రేల్‌ (జైసీ)ని నిర్దోషిగా ప్రకటించి ఈ కేసు నుంచి అతనికి విముక్తి లభించేలా చేసింది. ఏప్రిల్‌ 10 నాటికి ఉత్తర్వుల్లో నిందితుడిపై మోపిన అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందని అదనపు సెషన్స్‌ జడ్జీ పేర్కొన్నారు.

నిందితుడు బద్లాపూర్‌లోని కర్జాత్‌ హైవేపైన కత్రాప్‌ వద్ద చైనీస్‌ హోటల్‌లో పనిచేసేవాడు. ఏప్రిల్‌ 14, 2017న బాధితుడు జగత్‌ తేగ్‌బహదు షాహీతో సహ ఆ హోటల్‌ యజమానులు, ఇతర సిబ్బంది సమక్షంలో పార్టీ చేసుకున్నారు. ఆ తర్వాత యజమానులు వెళ్లిపోయారు. ఆ తర్వాత అక్కడ సదరు నిందితుడు, బాధితుడు మాత్రమేఉన్నారు. మరుసటి రోజు ఒక దుకాణదారుడు బాధితుడి తలతో ఉన్న ప్లాస్టిక్‌ బ్యాగ్‌ గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ నుంచి సుమారు వెయ్యి అడుగుల దూరంలో బాధితుడి శరీరాన్ని కనుగొన్నారు. దీంతో ఆ బాధితుడితో ఉన్న వ్యక్తి (రాజేష్‌ కుమార్‌)ని నిందితుడిగా అనుమానించి పుష్పక్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఉత్తర ప్రదేశ్‌కు వెళ్తుండగా అరెస్టు చేశారు. ఐతే పోలీసుల విచారణలో పలు లోపాలు ఉన్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. అలాగే బాధితుడు మరణానికి ముందు నిందితుడు అక్కడే ఉన్నాడు అనడానికి సరైన ఆధారాలు సమర్పించడంలో కూడా విఫలమైనట్లు పేర్కొన్నారు. దీంతో నిందితుడిని నొర్దోషిగా ప్రకటిస్తూ ఊరట కల్పించింది కోర్టు.
(చదవండి: బ్రిటన్‌ వెళ్లి శివాజీ ఖడ్గాన్ని తెచ్చేందుకు యత్నిస్తా!: మహారాష్ట్ర మంత్రి కీలక వ్యాఖ్యలు)

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)