Breaking News

ఈ రోజు ఆమెకు అంకితం: సీఎం మమత

Published on Wed, 08/28/2024 - 11:00

కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీ కర్‌ హాస్పిటల్‌లో హత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలియాజేశారు. తృణమూల్ కాంగ్రెస్‌ (టీఎంసీ) విద్యార్థి విభాగ ఆవిర్భావ దినోత్సవాన్ని కోల్‌కతా హత్యాచార ఘటనలో బలైన జూనియర్‌ డాక్టర్‌కు అంకితం ఇస్తున్నట్లు బుధవారం ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించారు.

‘ఇవాళ తృణమూల్ కాంగ్రెస్‌ విద్యార్థి విభాగ ఆవిర్భావ దినోత్సవాన్ని నేను కోల్‌కతా హత్యాచార ఘటనలో బలైన సోదరికి అంకితమిస్తున్నా. ఆమె మృతికి సంతాపం తెలియాజేస్తున్నా.  ఆ సోదరి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. బాధితురాలి కుటుంబ సభ్యులకు సత్వర న్యాయం జరగాలని కోరుకుంటున్నా. అలాగే భారతదేశం అంతటా ఇటువంటి అమానవీయ చర్యలకు గురైన మహిళందరికి సానుభూతి తెలియజేస్తున్నా.. క్షమించండి’ అని పేర్కొన్నారు.

జూనియర్‌ డాక్టర్‌పై హత్యాచార ఘటనకు బాధ్యత వహిస్తూ పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కోల్‌కతాలో మంగళవారం విద్యార్థులు చేపట్టిన ‘నబన్నా అభియాన్‌ (చలో సచివాలయ ర్యాలీ)’ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. విద్యార్థులు మార్చ్‌ అడ్డుకోవటం కోసం.. గాల్లోకి కాల్పులు జరపడంతో పాటు వాటర్‌ క్యానన్లు, బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. రాళ్ల దాడి, లాఠీచార్జిలో ఇరువైపులా చాలామంది గాయపడ్డారు. ఇక..పోలీసులు తీరుపై నిరసనగా ప్రతిపక్ష బీజేపీ బెంగాల్‌లో వ్యాప్తంగా  12 గంటల బంద్‌కు పిలుపునిచ్చి కొనసాగిస్తోంది. దీంతో పోలీసులు అప్రమత్తం అయి హైఅలెర్ట్‌ ప్రకటించారు.

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు