తెలంగాణకు ‘హిమాచల్‌’ విద్యుత్‌

Published on Fri, 01/31/2025 - 05:56

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విద్యుత్‌ సామర్థ్యాన్ని పెంపొందించడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచనలతో రాష్ట్ర అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం బూట్‌ (బిల్డ్‌ ఓన్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌) విధానంలో 22 హైడ్రో ఎలక్ట్రికల్‌ (జలవిద్యుత్‌) ప్రాజెక్టుల ఏర్పాటుపై ప్రతిపాదనలు ఆహ్వనించగా.. రాష్ట్ర విద్యుత్‌ శాఖ అధికారుల బృందం హిమాచల్‌ప్రదేశ్‌ను సందర్శించింది. ఈ సందర్భంగా 100 మెగావాట్లకు పైబడిన సామర్థ్యం గల రెండు ప్రాజెక్టుల ఏర్పాటుపై రాష్ట్రం ఆసక్తిని వ్యక్తం చేసింది.

ఇందుకు సంబంధించి హిమాచల్‌ ప్రభుత్వం ఎంఓయూపై సంతకం చేస్తే త్వరితగతిన తగిన తదుపరి చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క తెలిపారు. గురువారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, విద్యుత్‌ శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియాతో కలసి ఢిల్లీలో హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌సింగ్‌తో సమావేశమయ్యారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వం నుంచి సెలి (400 మెగావాట్లు), మియార్‌ (120 మెగావాట్లు) హైడ్రోఎలక్ట్రిక్‌ ప్రాజెక్టుల నిర్మాణంపై ఆసక్తిని వ్యక్తం చేస్తూ ఒక లేఖను సమర్పించారు.

ఈ సందర్భంగా ఎంఓయూ గురించి చర్చించారు. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయానికి రావాలని హిమాచల్‌ సీఎం, భట్టి నిర్ణయించారు. ఇదిలా ఉండగా ఈ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే జలవిద్యుత్‌ రాష్ట్రానికి సరఫరా అవుతుంది. ఈ విద్యుత్‌ వల్ల రాష్ట్ర అవసరాలు, భవిష్యత్‌ విద్యుత్‌ డిమాండ్లను తీర్చేందుకు వీలు ఏర్పడుతుందని అధికార వర్గాలు తెలిపాయి.

Videos

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)