Breaking News

హిమాచల్‌ కాంగ్రెస్‌ సంచలన నిర్ణయం

Published on Wed, 11/06/2024 - 19:52

షిమ్లా: కాంగ్రెస్‌ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్‌ ప్రదేశ్‌లో  రాష్ట్ర కాంగ్రెస్‌ యూనిట్‌ను రద్దు చేయాలని నిర్ణయించింది. హిమాచల్‌లో  పీసీసీ యూనిట్‌తో పాటు జిల్లా, బ్లాక్‌ కమిటీలు రద్దు చేస్తున్నట్లు  పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ బుధవారం ఓ ప్రకటన  విడుదల చేశారు.  

‘హిమాచల్ ప్రదేశ్‌ పీసీసీ యూనిట్‌, జిల్లా అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీలను రద్దు చేయాలని కాంగ్రెస్‌ నిర్ణయించుకుంది. ఈ ప్రతిపాదనకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంది’ అని  ప్రకటనలో తెలిపారు. 

కాంగ్రెస్‌ యూనిట్‌ రద్దు అనంతరం హిమాచల్‌ మంత్రి అనిరుధ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. త్వరలోనే కొత్త పీసీసీ చీఫ్‌ని నియమిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్‌లో ఇది సాధారణ చర్యగా పేర్కొన్నారు.  పీసీసీ, డీసీసీ, బ్లాక్ యూనిట్ల పదవీకాలం ముగిసినందున వాటిని రద్దు చేయాలనేది హిమాచల్ కాంగ్రెస్ కార్యకర్తలు చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నారని తెలిపారు.

కాగా ప్రస్తుత కార్యవర్గాన్ని రద్దు చేసి, కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతించాలని కోరుతూ ఇటీవల హిమాచల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్‌ పార్టీ హైకమాండ్‌కు లేఖ రాశారు. దీని ద్వారా కొత్త కమిటీలలో క్రియాశీల సభ్యులకు  ప్రాధాన్యత లభిస్తుందని  ఆమె తెలిపారు. దీనిపై ఆమె సీఎం సుఖ్‌విందర్‌ సింగ్‌ సుఖుతో మాట్లాడినట్లు పేర్కొన్నారు.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)