Breaking News

బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ముగ్గురు మృతి!

Published on Mon, 01/29/2024 - 07:22

కర్ణాటకలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం దక్షిణ కర్ణాటకలోని బెల్తంగడిలోని కుక్కడి గ్రామంలో గల ఒక బాణసంచా తయారీ కర్మాగారంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రత అధికంగా ఉంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.

ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటచేసుకుంది. ఈ పేలుడు శబ్దం చాలా మైళ్ల దూరం వరకూ వినిపించింది. ప్రస్తుతం క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వేనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ బాణసంచా ఫ్యాక్టరీ ఉంది. పేలుడు శబ్దం నాలుగు కిలోమీటర్ల దూరం వరకూ వినిపించింది. 

సమీపప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను వర్గీస్ (62), స్వామి (60), చేతన్ (24)గా గుర్తించినట్లు దక్షిణ కన్నడ పోలీసు సూపరింటెండెంట్ సీబీ రిషియంత్‌ తెలిపారు. ఈ ఉదంతంపై విచారణ జరిపి, పేలుడుకు గల కారణాలను తెలుసుకుంటున్నామని పోలీసులు పేర్కొన్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)