Breaking News

‘విద్యాశాఖ మంత్రికి రాజీనామా లేఖ రాయడం రాదు’

Published on Tue, 07/21/2026 - 13:20

న్యూఢిల్లీ: ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజీనామా లేఖ ఎలా రాయాలో ఆయనకు బహుశా తెలియదని ఆమె ఎద్దేవా చేశారు. నీట్ పరీక్షల్లో అక్రమాలు, విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్‌ వద్ద నిరసనలు కొనసాగుతున్నాయి.

పార్లమెంట్ వైపు సాగిన ‘చలో సంసద్’ మార్చ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు జరిపిన లాఠీచార్జిపై ఆందోళనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ధర్మేంద్ర ప్రధాన్‌ను రక్షించడం కోసమే ప్రభుత్వం పోలీసు బలగాలను ఉపయోగిస్తోందని, ఇరవై మందికి పైగా విద్యార్థుల మరణాలకు ఆయనే బాధ్యుడని సీజేపీ ఆరోపించింది. మరోవైపు కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష 24వ రోజుకు చేరుకుంది. భద్రతా సిబ్బంది ఆంక్షలు, భారీ వర్షాన్ని లెక్కచేయకుండా వాలంటీర్లు ఆందోళన స్థలాన్ని శుభ్రం చేస్తూ నిరసనను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై రాజకీయ ఒత్తిడి మరింత పెరుగుతోంది.

ఇది కూడా చదవండి: ‘వాంగ్‌చుక్‌కు ఏమైనా జరిగితే..’.. కాంగ్రెస్ ఎంపీ హెచ్చరిక

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య