Breaking News

థాక్రేకు బిగ్‌ షాక్‌.. బీజేపీలోకి ఆ నలుగురు ఎమ్మెల్యేలు!

Published on Sat, 10/22/2022 - 20:37

ముంబై: ఏక్‌నాథ్‌ షిండే తిరుగుబాటుతో మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న వేడి ఇప్పట్లో తగ్గేలా కనిపించటం లేదు. శివసేన అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే వర్గానికి షాక్‌ మీద షాక్‌ తగులుతూనే ఉంది. ఇప్పటికే అధికారం కోల్పోయి.. శివసేన గుర్తును కాపాడుకునేందుకే ఇబ్బందులు పడుతున్న థాక్రే వర్గానికి మరో దెబ్బ తగలనుంది. నలుగురు ఎమ్మెల్యేలు అధికార పక్షంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారటా! ఉద్ధవ్‌ థాక్రే వర్గానికి చెందిన నలుగురు శివసేన ఎమ్మెల్యేలు అధికార వర్గంలో చేరేందుకు తమతో టచ్‌లో ఉన్నారని కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణే శనివారం వెల్లడించారు. అంధేరీ అసెంబ్లీ ఉప ఎన్నికల వేళ ఎమ్మెల్యేలు అధికారపక్షంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలపటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరనేది బయటకు వెల్లడించలేదు రాణే.

‘మొత్తం 56 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 6-7 ఎమ్మెల్యేలు ఉన్నారు.(ఉద్ధవ్‌ థాక్రే వర్గంలో) వారు కూడా బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నలుగురు ఎమ్మెల్యేలు నాతో టచ్‌లో ఉన్నారు. కానీ, వారి పేర్లు నేను వెల్లడించను.’ అని తెలిపారు. పుణెలో నిర్వహించిన ‘రోజ్‌గార్‌ మేళా’ కార్యక్రమంలో ఈ మేరకు వెల్లడించారు. ఉద్ధవ్‌ థాక్రేపై విమర్శలు గుప్పించారు రాణే. ఆయన రాజకీయం కేవలం మాతోశ్రీ వరకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. అయితే, ఈ విషయంపై ఉద్ధవ్‌ థాక్రే వర్గం ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్‌ చేయలేదు. 

కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణే

ఇదీ చదవండి: ‘బ్రిటన్‌ ప్రధానిగా బోరిస్‌ సరైన వ్యక్తి’.. భారత సంతతి ఎంపీ మద్దతు

Videos

కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్

హైదరాబాద్ లో కరోనా కేసు నమోదు

జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం

YSRCP హరికృష్ణను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి.. దారుణం! : Ambati Rambabu

Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు

Chittoor: మామిడి రైతుల ఆవేదన..చేతులెత్తేసిన కూటమి

West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు

Photos

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)