Breaking News

మహారాష్ట్రలో కుప్పకూలిన ‘అక్రమ భవనం’.. 15 మంది దుర్మరణం

Published on Thu, 08/28/2025 - 09:52

మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వాసాయి విరార్‌లో మంగళవారం-బుధవారం మధ్య రాత్రి నాలుగు అంతస్తుల నివాస భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 15కి చేరింది. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్న అధికారులు.. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.  

ఐఏఎన్‌ఎస్ వార్తా సంస్థ కథనం ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున 12.05 గంటల సమయంలో విజయ్‌ నగర్‌లోని రమాబాయి అపార్ట్‌మెంట్‌లో వెనక భాగం కూలిపోయింది. దానిలో కొంత భాగం పక్కనే ఉన్న ఖాళీ భవనంపై పడింది. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు, మున్సిపల్ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.  అంతా గాఢనిద్రలో ఉండగా ప్రమాదం జరగడంతో మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదం జరిగిన ప్రాంతంలో మొత్తం 50 ఫ్లాట్లు ఉన్నాయి. వాటిలో కూలిపోయిన భాగంలో 12 అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. అయితే కూలిన భవనం అక్రమ కట్టడమని విచారణలో తేలింది. దీంతో.. వాసాయి విరార్ మున్సిపల్ కార్పొరేషన్ (వీవీఎంసీ) ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు భవన నిర్మాణదారుడు నిటల్‌ గోపినాథ్‌ను అరెస్టు చేశారు. ల్యాండ్‌ ఓనర్‌ మీద కూడా కేసు నమోదైనట్లు సమాచారం. 

ఏడాది పుట్టినరోజు వేడుక చేసుకున్న నాడే.. 
ఘటనలో ఆరోహి జోయెల్‌(24), ఆమె ఏడాది చిన్నారి కన్నుమూశారు. భర్త ఓంకార్‌ జోయల్‌ జాడ ఇంకా తెలియరాలేదు. చిన్నారి ఏడాది పుట్టినరోజు కేక్‌ కట్టింగ్‌ వేడుక జరిపిన కొన్నిగంటలకే.. అదీ సోషల్‌ మీడియాలో ఫొటోలు పోస్ట్‌ చేసిన ఐదు నిమిషాలకే ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శిథిలాల కింద ఆ తల్లీకూతుళ్లు విగతజీవులయ్యారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)