Breaking News

క్లాస్‌రూంలో గురకపెట్టి నిద్రపోయిన టీచర్‌.. వీడియో వైరల్

Published on Sun, 06/22/2025 - 11:05

జాల్నా: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి సన్మార్గంలో నడిపించాల్సిన ఓ టీచర్‌ తరగతి గదిలోనే విద్యార్థులందరూ ఉండగానే నిద్రపోయిన ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వగా.. అధికారులు విచారణకు ఆదేశించారు.

మహారాష్ట్రలోని జాల్నా జిల్లా గడేగావన్ గ్రామంలో ఉన్న మరాఠీ మీడియం జిల్లా పరిషత్ పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్న వీకే ముండే.. ఇటీవల తరగతి గదిలో సుమారు 15 నుంచి 20 మంది విద్యార్థులు పాఠాలు చదువుకుంటుండగా, ఆయన కుర్చీలో వెనక్కి వాలి.. కాళ్లు బల్లపై పెట్టి గురక పెడుతూ సుమారు 30 నిముషాలు గాఢ నిద్రలో మునిగిపోయారు.

ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేయడంతో సంచలనం సృష్టించింది. "మాస్టారు ఎంతసేపటి నుంచి నిద్రపోతున్నారు?  ఓ విద్యార్థిని అడగ్గా.. అర గంట నుంచి అంటూ సమాధానం ఇవ్వడం వీడియోలో వినిపిస్తోంది. కాసేపటికి ఆ ఉపాధ్యాయుడు ఒళ్లు విరుచుకుంటూ నిద్ర లేచాడు. ఈ ఘటనపై జోనల్ విద్యాధికారి సతీష్ షిండేకు ఫిర్యాదు అందగా.. ఆయన స్పందిస్తూ.. సంఘటనపై విచారణ జరిపిస్తామని.. వాస్తవాలు తేలిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Teacher Sleep in classroom


 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)