సీసీటీవీ, సీట్‌ బెల్టులు, జీపీఎస్‌..

Published on Sun, 07/19/2026 - 05:08

ముంబై: విద్యార్థుల భద్రతకు పెద్ద పీట వేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం స్కూలు బస్సులకు కఠిన నిబంధనలను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్కూలు బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు, సీట్‌ బెల్టులు, జీపీఎస్‌ ట్రాకింగ్‌ వ్యవస్థలను తప్పని సరి చేసింది. స్కూలు బస్సులు, వ్యానులు, విద్యా సంస్థల బస్సుల కనీస చార్జీలను సైతం తామే నిర్ణయిస్తామని తెలిపింది. 

2011 నాటి నిబంధనలను మారు స్తూ మహారాష్ట్ర మోటార్‌ వెహికల్స్‌ (రెగ్యులే షన్‌ ఫర్‌ స్కూల్‌ బస్సెస్‌) (మొదటి సవరణ) నిబంధనలు–2026ను ఈ నెల 16వ తేదీన నోటిఫై చేసింది. కిలోమీటర్‌కు చొప్పున ఒక్కో విద్యార్థి నుంచి వసూలు చేసే చార్జీల బేస్‌ రుసుమును ఆర్‌టీఏలు ఖరారు చేస్తాయని తెలిపింది. గతంలో ఇలాంటి నిబంధనేదీ లేక పోవడం గమనార్హం. 

నెలవారీ లేదా మూడు నెలలకు గాను ప్రాంతీయ రవాణాధికారి నిర్ణయించే రుసుముకు 10 శాతానికి తక్కువ కాకుండా, 10 శాతానికి మించకుండా వసూలు చేయవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొంది. నిబంధనల అమలు, విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రుల ఫిర్యాదుల పరిష్కారం అంశాలపై స్కూల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిటీ పరిశీలన జరిపి జిల్లా స్కూల్‌ బస్‌ సేఫ్టీ కమిటీలకు మూడు నెలలకోసారి నివేదిక అందజేయాల్సి ఉంటుంది. 

అదేవిధంగా, కొత్తగా జీపీఎస్‌ లైవ్‌ ట్రాకింగ్, పానిక్‌ బటన్, సీసీటీవీ నిఘా, డిజిటల్‌ అటెండెన్స్, ఆటోమేటిక్‌ అలెర్టులు తల్లిదండ్రులకు కూడా అందుబాటులో ఉంచటం తప్పనిసరి చేసింది.

  సీసీటీవీ ఫుటేజీని కనీసం 30 రోజులపాటు భద్రపర్చాలి. మొబైల్‌ యాప్‌ ద్వారా తల్లిదండ్రులకు అందుబాటులో ఉంచాలని నోటిఫికేషన్‌లో సూచించింది. బస్సులోని అన్ని సీట్లకు బెల్టులను అమర్చేలా నవీకరించాలని కోరింది. బస్సుల్లో అగ్ని ప్రమాదం పై అలారమ్‌ వ్యవస్థలను ఏర్పాటు చేయడం తప్పనిసరని తెలిపింది. ఐదో తరగతి వరకు విద్యార్థుల కోసం బస్సుల్లో మహిళా అటెండెంట్‌ను నియమించడం, అవకరాలు కలిగిన చిన్నారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు తప్పనిసరి చేసింది. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)