Breaking News

ఆయన బీజేపీతో కలిస్తే.. మేం నిష్క్రమిస్తాం

Published on Wed, 04/19/2023 - 16:36

ముంబై:  పవా(వ)ర్‌ హీట్‌తో.. మహారాష్ట్ర రాజకీయం మళ్లీ వేడెక్కింది. వచ్చే పది, పదిహేను రోజుల్లో రాజకీయ కుదుపులకు హస్తినతో పాటు మహారాష్ట్ర సైతం వేదిక అవుతుందంటూ ప్రచారం మొదలైన నేపథ్యంలో.. ఏం జరగనుందా? అనే చర్చ జోరుగా అక్కడ నడుస్తోంది. ఈ తరుణంలో.. ఎన్‌సీపీ నేత అజిత్‌ పవార్‌ హాట్‌ టాపిక్‌గా మారారు. 

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత అజిత్‌ పవార్‌.. మద్దతు ఎమ్మెల్యేలతో బీజేపీతో దోస్తీకి సిద్ధపడుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే.. అదంతా ఉత్త ప్రచారమేనని, తాను ఎన్‌సీపీతోనే ఉంటానని తాజాగా స్పష్టమైన ప్రకటన చేశారు ఆయన. అయినప్పటికీ అజిత్‌ పవార్‌ తీరుపై అనుమానాలు కొనసాగుతున్నాయి. బీజేపీతో దోస్తీ ప్రచారం అట్లాగే చర్చల్లో ఉండిపోయింది. ఈ తరుణంలో.. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేకి చెందిన శివసేన వర్గం స్పందించింది.   

ఎన్‌సీపీ నేత అజిత్‌ పవార్‌ గనుక బీజేపీతో చెయ్యి కలిపితే.. తాము ప్రభుత్వ కూటమి నుంచి బయటకు వెళ్లిపోతామని షిండే వర్గం హెచ్చరించింది. ఈ మేరకు షిండే తాజాగా నియమించిన పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ శిర్సత్ మీడియాతో మాట్లాడారు. 

మా సిద్ధాంతం స్పష్టంగా ఉంది. ఎన్‌సీపీ అనేది వెన్నుపోటు పార్టీ. అలాంటి పార్టీతో అంటకాగే దుస్థితిలో మేం లేం. యావత్‌ మహారాష్ట్ర ఈ పరిణామాన్ని ఇష్టపడదు కూడా. కాంగ్రెస్‌-ఎన్‌సీపీలతో కూటమిలో కొనసాగకూడదనే కదా బయటకు వచ్చేం. ఇప్పుడు మళ్లీ ఆ పార్టీతో ఎలా జట్టు కడతాం? అని శిర్సత్‌ మీడియా ద్వారా తెలియజేశారు. బీజేపీతో ఎన్సీపీ నేరుగా జత కట్టే అవకాశం లేదని.. ఒకవేళ అలాంటిదే జరిగితే మాత్రం తాము ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేస్తామని శిర్సత్‌ సంకేతాలు పంపారు. 

అజిత్‌ పవార్‌ ఎప్పటి నుంచో పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన తనయుడు పార్థా పవార్‌ ఓటమిని ఆయన తట్టుకోలేకపోయాడు. పైగా ఇప్పుడు  ఎన్సీపీలో ఆయనకు ఫ్రీ హ్యాండ్‌ లేదు. ఈ పరిణామాలతోనే ఆయన ఆ పార్టీని వీడాలనుకుంటున్నారు. అజిత్‌ పవార్‌ ఎన్‌సీపీని వీడాలనే నిర్ణయాన్ని మేం స్వాగతిస్తాం. కానీ, ఎన్‌సీపీ నేతలతో గుంపుగా బీజేపీకి స్నేహ హస్తం చాచితే మాత్రం.. మేం ప్రభుత్వంలో కొనసాగబోం అని శిర్సత్‌ స్పష్టం చేశారు. 

2019లో జరిగిన పరిణామాన్ని ఎవరూ మరిచిపోరు. ఫడ్నవిస్‌-అజిత్‌ పవార్‌ సాయంతో ఆఘమేఘాల మీద తెల్లవారుజామున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మూడే రోజుల్లో ఆ ప్రభుత్వం కుప్పకూలింది. దీనిపై శరద్‌ పవార్‌.. రాష్ట్రపతి పాలనను వెనక్కి తీసుకునేందుకు చేసిన ప్రయోగమంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. కానీ, అజిత్‌ పవార్‌  మాత్రం రెండున్నరేళ్లు గడిచినా నాటి పరిణామాలపై మౌనంగా ఉన్నారు అంటూ శిర్సత్‌ నాటి విషయాలను గుర్తు చేశారు.

ఇదీ చదవండి: బాంబే హైకోర్టులో షిండే సర్కార్‌కు ఊరట

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)