Breaking News

అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రి

Published on Mon, 07/21/2025 - 04:07

ముంబై: మహారాష్ట్రలో అధికార ఎన్‌సీపీ నేత, వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్‌రావ్‌ కొకటే మరో వివాదంలో చిక్కుకున్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో సెల్‌ఫోన్‌లో రమ్మీ ఆడుతూ దొరికిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రతిపక్ష ఎన్‌సీపీ(ఎస్‌పీ) ఎమ్మెల్యే రోహిత్‌ పవార్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేయడంతో గందరగోళం మొదలైంది. బీజేపీని సంప్రదించకుండా ఎన్‌సీపీ పక్షం ఏపనీ చేయలేకపోతోంది.

దీంతో, పనిలేక ఆ పార్టీ మంత్రులు మొబైల్‌ గేమ్స్‌ ఆడుకుంటున్నారని ఆరోపించారు. అన్నదాతల సమస్యల పరిష్కారంపై అధికార పక్షానికి శ్రద్ధ లేదని కాంగ్రెస్‌ నేత విజయ్‌ వడెట్టివార్‌ మండిపడ్డారు. విమర్శలపై కొకటే స్పందించారు. ‘అసెంబ్లీ సమావేశాల తీరును తెల్సుకునేందుకు నా సెల్‌ఫోన్‌ను తీశా. అయితే, అప్పటికే డౌన్‌లోడ్‌ చేసిన గేమ్‌ సడన్‌గా ఓపెనైంది. దాన్ని క్లోజ్‌ చేశాను.

ఇదంతా కేవలం 5, 10 సెకన్లలోనే జరిగిపోయింది. అంతేతప్ప, గేమ్‌ను ఆడటానికి ఓపెన్‌ చేయలేదు’అని వివరణ ఇచ్చుకున్నారు. కాగా, కొకటే ఏప్రిల్‌లోనూ ఓ వివాదంలో చిక్కుకున్నారు. రైతులు ప్రభుత్వ వ్యవసాయ పథకాల ద్వారా అందిన డబ్బును వివాహాలకే ఖర్చు చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో, ఆయన క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)