Breaking News

ఆ హీట్‌ స్ట్రోక్‌ హీట్‌ మాములుగా లేదు! దెబ్బకు బహిరంగ కార్యక్రమాలు..

Published on Wed, 04/19/2023 - 16:35

మహారాష్ట్రలోని అవార్డుల కార్యక్రమంలో వడదెబ్బతో సుమారు 13 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటన చర్చనీయాంశంగా మారడమే గాక సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి కూడా. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఎండలు తగ్గేవరకు మధ్యాహ్నం నుంచి సాయంత్ర 5 గంటల వరకు ఎలాంటి బహిరంగ కార్యక్రమాలను నిర్వహించకూడదని నిషేధించింది. వాస్తవానికి నాడు బహిరంగ మైదానంలో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన భూషణ్‌ అవార్డుల కార్యక్రమానికి లక్షలాదిమంది హాజరయ్యారు. ఆ సమావేశం మండే ఎండలో జరిగినట్లు తెలుస్తోంది. ఆ రోజు ఆ సమావేశం జరిగనప్పుడూ గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

ఈ కార్యక్రమానిక ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లు, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తదితరులు హాజరయ్యారు. ఈ విషాద ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ సిండే రూ. 5 లక్షల పరిహారం కూడా ప్రకటించారు. ఇదిలా ఉండగా, ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రణాళిక పై ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టాయి. షిండే ప్రభుత్వంపై నరహత్య కేసు నమోదు చేయాలని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు అజిత్‌ పవార్‌ డిమాండ్‌ చేశారు. ఇది ప్రకృతి వైపరిత్యం కాదని, మానవ నిర్మిత విపత్తు అని విమర్శులు గుప్పించారు. దీనికి ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని పవార్‌ ట్వీట్‌ చేశారు. మృతుల కుటుంబాలకు అధిక పరిహారం ఇవ్వాలని కూడా పవార్‌ డిమాండ్‌ చేశారు. 

(చదవండి: దేశంలో అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏంటో తెలుసా?)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)