Breaking News

మహారాష్ట్ర పాలి‘ట్రిక్స్‌’.. అజిత్‌ పవార్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

Published on Sun, 11/23/2025 - 07:25

పుణె: ఎన్‌సీపీ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అభ్యర్థులను ఎన్నుకుంటే నిధుల కొరత అనేదే లేకుండా చేస్తాం, ఓటేయకుంటే మాత్రం, తామూ పట్టించుకోమంటూ వారిని హెచ్చరించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల ప్రకారం.. శుక్రవారం బారామతి జిల్లా మాలెగావ్‌ నగర పంచాయతీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న పవార్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ–ఎన్‌సీపీ–శివసేన సంకీర్ణ ప్రభుత్వంలో అజిత్‌ పవార్‌ ఆర్థిక మంత్రిగా ఉండటం గమనార్హం. ‘మా ఎన్‌సీపీ అభ్యర్థులు 18 మందిని ఎన్నుకుంటే నిధుల కొరత అనేదే ఉండదు. మొత్తం పద్దెనిమిది మందినీ ఎన్నుకుంటే, నేను ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేరుస్తా. మా అభ్యర్థులను తిరస్కరించిన పక్షంలో నిధులివ్వను. మీ వద్ద ఓట్లుంటే, నా దగ్గర నిధులున్నాయి’అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. 

మరోవైపు.. అజిత్‌ పవార్‌ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తప్పుబట్టాయి.  ఆయనపై ఎన్నికల కమిషన్ ఎందుకు ఎటువంటి చర్య తీసుకోలేదని ప్రశ్నించాయి. ఈ నేపథ్యంలో శివసేన (ఉద్ధవ్ బాలషేబ్ బిటి) నాయకుడు అంబదాస్ దన్వే స్పందిస్తూ..‘నిధులు అజిత్ పవార్ ఇంటి నుండి కాకుండా సామాన్య ప్రజలు చెల్లించే పన్నుల నుండి ఇవ్వబడతాయి. పవార్ వంటి నాయకుడు ఓటర్లను బెదిరిస్తుంటే, ఎన్నికల కమిషన్ ఏమి చేస్తోంది? అని ప్రశ్నలు సంధించారు. ఇక, మహారాష్ట్రలో నగర పంచాయతీలకు ఎన్నికలు డిసెంబర్ 2న జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పవర్‌ ఇలా కామెంట్స్‌ చేయడం గమనార్హం. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)