Breaking News

అబ్బాయిగా మారిన లేడి కానిస్టేబుల్‌.. తండ్రిగా ప్రమోషన్‌

Published on Sat, 01/20/2024 - 21:07

మహారాష్ట్రకు చెందిన మహిళా కానిస్టేబుల్‌. ఎన్నో కష్టాలు పడి మగవాడిలా మారింది. కుటుంబాన్ని, సమాజాన్ని ఎదురించి పురుషుడిగా సర్జరీ చేయించుకుంది. తర్వాత కొన్నాళ్లకు ఓ యుతిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆ జంట బిడ్డకు జన్మనివ్వడంతో.. కానిస్టేబుల్‌ తండ్రిగా ప్రమోషన్‌ పొందాడు. వివరాలు..  బీద్‌ జిల్లా రాజేగాన్‌ గ్రామానికి చెందిన లలితా సాల్వే(35) కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది. 

25 ఏళ్ల వయసులో (2013) తన శరీరంలో మార్పులు రావడాన్ని గమనించింది. ఆసుప్రతికి వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకోగా.. ఆమెలో మగవారిలో ఉండే వై క్రోమోజోమ్‌లు ఉన్నట్లు తేలింది. (ఆడవారిలో రెండు ఎక్స్‌ క్రోమోజోములు మాత్రమే ఉంటాయి). జెండర్‌ డిస్ఫోరియాతో బాధపడుతున్న ఆమెకు లింగ మార్పిడి సర్జరీ చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు.

ఈ క్రమంలో  లలితా సాల్వే 2017లో బాంబే హైకోర్టును ఆశ్రయించింది. లింగమార్పిడి సర్జరీ కోసం నెల రోజులు సెలవు కోరింది. బాంబే హైకోర్టుతోపాటు 2018లో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతివ్వడంతో లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంది. 2018 నుంచి 2020 వరకు మూడు సర్జరీల ద్వారా పురుషుడిగా మారింది. దీంతో లలితా నుంచి తన పేరును లలిత్ కుమార్ సాల్వేగా మార్చుకుంది. అనంతరం 2020లో ఛత్రపతి శంభాజీనగర్‌కు (ఔరంగాబాద్‌) చెందిన సీమాను పెళ్లి చేసుకొని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. వివాహమైన నాలుగేళ్ల తర్వాత జనవరి 15న ఆ జంటకు బాబు పుట్టాడు.
చదవండి: Video: అకస్మాత్తుగా కూలిన అయిదు అంతస్తుల భవనం

లలిత్‌ సాల్వే మాట్లాడుతూ.. స్త్రీ నుంచి పురుషుడిగా మారిన తన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. అనేక పోరాటాలు చేసి చివరికి తన జెండర్‌ మార్చుకునట్లు తెలిపారు. ఈ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన అందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)