Breaking News

Maharashtra:‘హిందీ’పై గరంగరం.. త్రిభాషా విధానం రద్దు

Published on Mon, 06/30/2025 - 08:48

ముంబై: మహారాష్ట​ ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలల్లో త్రిభాషా విధానాన్ని ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై వెనక్కు తగ్గింది. త్రిభాషా విధానంలో భాగంగా హిందీని తప్పనిసరి చేసే ప్రభుత్వ ప్రయత్నాన్ని పలు రాజకీయ పార్టీలు తీవ్రంగా విమర్శించిన దరిమిలా తాజా నిర్ణయం తీసుకుంది. ఈ విధానం అమలుపై ఒక  కమిటీ సమగ్రంగా చర్చించనున్నదని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు.

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తర్వాత సీఎం ఫడ్నవీస్ మాట్లాడుతూ ‘పాఠశాలల్లో వివిధ భాషలను ఏ ప్రమాణాల ప్రకారం అమలు చేయాలి? విద్యార్థులకు ఏ ఎంపికలు ఇవ్వాలి? అనేది నిర్ణయించేందుకు విద్యావేత్త డాక్టర్ నరేంద్ర జాదవ్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా, రాష్ట్ర ప్రభుత్వం త్రిభాషా విధానం అమలుపై తుది నిర్ణయం తీసుకుంటుంది. అప్పటి వరకు ఏప్రిల్ 16, జూన్ 17న జారీ చేసిన రెండు ప్రభుత్వ తీర్మానాలను రద్దు చేస్తున్నాం’ అని ప్రకటించారు.

ఫడ్నవీస్ ప్రభుత్వం గతంలో ఒక ప్రకటనలో ఇంగ్లీష్, మరాఠీ మీడియం పాఠశాలల్లో చదువుతున్న ఒకటి నుండి ఐదవ తరగతి విద్యార్థులకు హిందీని తప్పనిసరి మూడవ భాషగా వెల్లడించింది. దీనిపై శివసేన (యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ సేన, ఎన్‌సీపీ (ఎస్‌పీ)ల ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి  ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో సీఎం మాట్లాడుతూ ప్రభుత్వం మరాఠీపై దృష్టి సారిస్తుందని ప్రకటించారు. అలాగే ఇంగ్లీషును అంగీకరించిన ఉద్ధవ్ థక్రే తీరును ఆయన తప్పుబట్టారు. గతంలో త్రిభాషా విధానం అమలుపై ఒక కమిటీని ఏర్పాటు చేయాన్న డాక్టర్ రఘునాథ్ మషేల్కర్ కమిటీ సిఫార్సులను ఉద్ధవ్ థాక్రే అంగీకరించారని ఆరోపించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అందరూ హిందీ భాష నేర్చుకోవాలని కోరుకున్నారని సీఎం ఫడ్నవీస్‌ అన్నారు.

ఇది కూడా చదవండి: ట్రంప్‌, నెతన్యాహులపై ఇరాన్‌ ఫత్వా.. ప్రపంచవ్యాప్త పిలుపు

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)