Breaking News

మంత్రివర్గ విస్తరణ వెంటనే శరద్‌ పవార్‌ నివాసానికి అజిత్‌

Published on Sat, 07/15/2023 - 11:41

ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌పవార్‌.. ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్‌ పవార్‌ నివాసానికి వెళ్లారు. కేబినెట్‌ విస్తరణ జరగిన కొన్ని గంటల్లోనే ముంబైలోని శరద్‌ పవార్‌ అధికారిక నివాసమైన ‘సిల్వర్‌ ఓక్‌’ను సందర్శించడం చర్చనీయాంశంగా మారింది. కాగా ఎన్సీపీపై తిరుగుబాటు ఎగురవేసి, తన వర్గం నేతలతో ప్రభుత్వంలో చేరిన అనంతరం అజిత్‌, ఎన్‌సీపీ అధినేత ఇంటికి వెళ్లడం ఇదే తొలిసారి. 

అయితే అజిత్‌ పవార్‌ తన బాబాయ్‌ శరద్‌ పవార్‌తో సమావేశమయ్యారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై అజిత్‌ పవార్‌ వర్గం నేతలు స్పందించారు. తన భేటీ వెనక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని తెలిపారు. కేవలం తన చిన్నమ్మ(శరద్‌ భార్య) ప్రతిభా పవార్‌ పరామర్శించడానే ఆ ఇంటికి వెళ్లారని వెల్లడించారు. 

కాగా శరద్‌ పవార్‌ సతీమణి ప్రతిభకు క్రవారం దక్షిణ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేతికి సంబంధించిన శస్త్రచికిత్స జరిగింది. అనంతరం ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ కాగా.. చిన్నమ్మను చూసేందుకు అజిత్‌ శరద్‌ నివాసానికి వెళ్లారు. ఇదిలా ఉండగా అజిత్ పవార్ తన చిన్నమ్మ ప్రతిభతో మంచి సాన్నిహిత్యం ఉంది. 2019లో పవార్‌, దేవేంద్ర ఫడ్నవీస్‌ స్వల్పకాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత.. అతన్ని తిరిగి ఎన్సీపీలోకి తీసుకురావడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.
చదవండి: ఒక్క పర్వతంపై 900 ఆలయాలు.. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా..

ఇక జూలైన 2న ఎన్సీపీని రెండు గా చీల్చిన అజిత్‌ పవార్‌ 30-35 మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. అందులో అజిత్‌ పవార్‌ డిప్యూటీ సీఎంగా, మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 

అయితే రెండు వారాల తర్వాత  వీరికి శుక్రవారం శాఖలు కేటాయింపు జరిగింది. అజిత్‌కు రెండు ప్రధాన ఆర్థిక, ప్రణాళిక శాఖ కేటాయించారు.  ఆయన వర్గానికి చెందిన మరో ఎనిమింది మంది మంత్రులకు శాఖలు కేటాయించారు. ఇప్పటి వరకు శిండే, ఫడ్నవీస్‌ వర్గానికి చెందిన 20 మంది మత్రులతోనే ప్రభుత్వాన్ని నెట్టొచ్చారు. ఇప్పుడు అజిత్‌ వర్గం కూడా చేరండంతో రాష్ట్ర కేబినెట్‌లో మంత్రుల సంఖ్య 29కి చేరింది. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)