Breaking News

Maharashtra Elections: మళ్లీ మహాయుతి!

Published on Thu, 11/21/2024 - 04:50

న్యూఢిల్లీ: బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి మహారాష్ట్రలో అధికారం నిలుపుకోనుందని ఎగ్జిట్‌ పోల్స్‌ జోస్యం చెప్పాయి. జార్ఖండ్‌లో కూడా ఎన్డీఏ కూటమిదే పై చేయని తేల్చాయి. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ బుధవారం సాయంత్రం ముగిసింది. ఆ వెంటనే ఆ రాష్ట్రాల ఫలితాలపై ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడ్డాయి. బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్‌)లతో కూడిన మహాయుతి విజయం ఖాయమని దాదాపుగా అన్ని సంస్థలూ అంచనా వేశాయి. 

కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్‌పీ)లతో కూడిన విపక్ష మహా వికాస్‌ అఘాడీ ఓటమి చవిచూడనున్నట్టు చెప్పాయి. ఒక్క లోక్‌పోల్‌ మాత్రమే ఎంవీఏ గెలుస్తుందని పేర్కొంది. 288 అసెంబ్లీ స్థానాలకు గాను ఆ కూటమికి 150కి పైగా స్థానాలు వస్తాయని, మహాయుతి 130 లోపే సాధిస్తుందని అంచనా వేసింది. జార్ఖండ్‌లో నవంబర్‌ 13, 20 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్‌ జరగ్గా మహారాష్ట్రలో బుధవారం ఒకే విడతలో ముగియడం తెలిసిందే. రెండు రాష్ట్రాల్లోనూ శనివారం ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెలువడతాయి.

జార్ఖండ్‌లో టఫ్‌ ఫైట్‌ 
జార్ఖండ్‌లో అధికార జేఎంఎం–కాంగ్రెస్‌ కూటమికి, బీజేపీ సారథ్యంలోని విపక్ష ఎన్డీఏ కూటమికి మధ్య హోరాహోరీ సాగిందని ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చాయి. అత్యధిక పోల్స్‌ ఎన్డీఏకే మొగ్గుతున్నట్టు పేర్కొన్నాయి. బొటాబొటి మెజారిటీతో అధికారం దక్కించుకోవచ్చని అభిప్రాయపడ్డాయి. ఈ అంచనాల నేపథ్యంలో అక్కడ చివరికి హంగ్‌ వచి్చనా ఆశ్చర్యం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. ఒక్క యాక్సిస్‌ మై ఇండియా మాత్రమే జేఎంఎం కూటమి గెలుస్తుందని అంచనా వేసింది. 81 అసెంబ్లీ సీట్లకు గాను దానికి 53 సీట్లొస్తాయని, ఎన్డీఏ కూటమి 25కు పరిమితమవుతుందని పేర్కొంది. మహారాష్ట్రపై తమ అంచనాలను గురువారం ప్రకటించనున్నట్టు సంస్థ తెలిపింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)