Breaking News

Ajit Pawar: అదంతా జస్ట్ రూమర్

Published on Tue, 04/18/2023 - 15:00

ముంబై: నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(NCP) నేత, మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ తన మద్దతుదారులతో సహా బీజేపీలోకి మారతారంటూ వస్తున్న ప్రచారంపై స్పందించారు.  ఈ అంశం ఇప్పుడు మహా రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే ఆ ప్రచారాన్ని ఖండించిన ఆయన.. ఏ కారణం లేకుండా రూమర్లను ప్రచారం చేస్తున్న మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. 

పుకార్లలో ఏదీ నిజం కాదు. ఎన్సీపీలోనే ఉంటా. ఎన్సీపీతోనే నా ప్రయాణం కూడా అని పేర్కొన్నారు. ఎన్సీపీలో ముసలం, ప్రతిపక్షాల కూటమిలో చీలిక వచ్చిందన్న ప్రచారాల్ని ఆయన ఖండించారు. ఇలాంటి ప్రచారాల వల్ల ఎన్సీపీ కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. వాళ్లందరికీ చెప్పేది ఒక్కటే. ఎలాంటి ఆందోళన చెందకండి. ఎన్సీపీ అనేది శరద్‌ పవార్‌ నాయకత్వంలో ఏర్పాటైన పార్టీ. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. మన ఉనికి మనదే అజిత్‌ పవార్‌ ప్రకటించారు. పవార్‌ తర్వాత నెంబర్‌ టూగా ఎన్సీపీలో ఆయన అన్న కొడుకు అజిత్‌ పవార్‌ హవా నడుస్తోంది. కొందరు ఎమ్మె‍ల్యేలు సైతం ఆయన వెంట ఉన్నారు. 

అయితే.. పవార్‌ కూతురు సుప్రియా సూలే ఈ ఉదయం చేసిన వ్యాఖ్యలు మహా రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీశాయి. వచ్చే పదిహేను రోజుల్లో రెండు పెద్ద రాజకీయ కుదుపులకు వేదిక కానుందని వ్యాఖ్యానించారామె. ఒకటి ఢిల్లీ స్థాయిలో, మరొకటి మహారాష్ట్రలో రాజకీయ కుదుపులు ఉండనున్నాయని ఆమె పేర్కొన్నారు. అయితే అవేంటని మీడియా ఆమెను ఆరా తీయగా.. దాటవేత సమాధానం ఇచ్చారు.

అది అజిత్‌ పవార్‌ పార్టీ మారడం గురించేనా అని అడగ్గా.. ఆ విషయాన్ని అజిత్‌ దాదా(అజిత్‌​ పవార్‌ను ఉద్దేశించి)నే అడగాలని రిపోర్టర్లకు సూచించారామె.  ప్రజాప్రతినిధిగా తనకు చాలా పని ఉందని, ఉత్తినే మాట్లాడేందుకు తనకు సమయం లేదన్నారు.

అంతకు ముందు ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌.. ఎన్సీపీ ఎమ్మెల్యేల చీలిక, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే వర్గంతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటూ వచ్చిన కథనాలను ఖండించారు. ‘పవార్‌ ఎన్సీపీ ఎమ్మెల్యేలతో ఎలాంటి సమావేశానికి పిలుపు ఇవ్వలేదు. అతను ఎన్సీపీ కోసమే పని చేస్తున్నాడు. ఇంతా మీ బుర్రలోంచి పుట్టిందేమో అంటూ మీడియాకు చురకలు అంటించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)